బోధన్, వెలుగు : బోధన్పట్టణంలోని శక్కర్‌నగర్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ.. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ 2015 డిసెంబర్ 23న లేఆఫ్ చేసి తొమ్మిది యేండ్లు పూర్తికావడంతో చీకటి రోజుగా ప్రకటిస్తున్నామన్నారు. ఎంతోమంది కార్మికులు చనిపోయారని, కార్మికుల కుటుంబాలు రోడ్డును పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బకాయి వేతనాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఉపేందర్, నాగుల రవిశంకర్ గౌడ్, బాలకృష్ణ, శ్రీనివాస్, రాంబాబు, ఈరవేని సత్యనారాయణ, శ్రీధర్, దాస్, భూమయ్య, భిక్షపతి, బీజేపీ నాయకులు రామరాజు, పాల్గొన్నారు.