- పైలెట్ ప్రాజెక్ట్‌గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎంపిక
- మీడియేటర్లకు మూడు రోజుల ట్రైనింగ్
- వర్చువల్‌గా ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
నిజామాబాద్, వెలుగు : సామాజిక వివాదాల పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేటర్ల విధానాన్ని అమలు చేసేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైంది. సామాజిక సేవ చేసే కొందరు వ్యక్తులను ఎంపిక చేసి వారికి మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైనింగ్ తీసుకున్న కమ్యూనిటీ మీడియేటర్ల సహాయం తీసుకుంటే ప్రయోజనం కలుగుతుందన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఈ విధానం సత్ఫలితం ఇవ్వడంతో తెలంగాణలో కూడా అమలు చేయాలన్న ఉద్దేశంతో నిజామాబాద్‌ను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ వలంటీర్ల సహాయంతో కుటుంబ తగాదాలు, సామాజిక వివాదాలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ప్రోగ్రాం రీసోర్స్ పర్సన్స్, రిటైర్ట్ జడ్జి మహ్మద్ షమీం, స్టేట్ లీగల్ అథారిటీ సెక్రటరీ పంచాక్షరి, జిల్లా జడ్జి సునీత కుంచాల, కామారెడ్డి సెషన్స్ జడ్జి వరప్రసాద్, కలెక్టర రాజీవ్‌గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్ పాల్గొన్నారు.