నిజామాబాద్ సిటీ, వెలుగు, : నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే నరాల హరి నారాయణ మనుమడు నరాల హరీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.గురువారం గాజుల్ పేట్ లోని విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘంలో సమావేశం నిర్వహించారు.
నరాల హరీన్ కు ఎమ్మెల్సీ బి. మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయానికి కృషి చేస్తానన్నారు.
లింగంపేట : లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మున్నూరుకాపు సంఘం సభ్యులు, ముంబాజీపేట గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు గురువారం సాయంత్రం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి స్వాగతించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, జడ్పీటీసీ సంతోష్‌రెడ్డి , ఎంపీపీ అబ్దుల్‌నయీం, నాయకులు రఫియోద్దిన్, ఎల్లమయ్య, మాకం రాములు, సుప్పాల రాజు, నగేశ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.