నిజామాబాద్, వెలుగు : ‘బల్దియాలో తాగునీరు, అండర్ డ్రైనేజీ , డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీపై స్పందించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినా పట్టించుకోలె.. రూ.100 కోట్ల సీఎం స్పెషల్ ఫండ్ లో డివిజన్ల అభివృద్ధికి రూ. 1 కోటి పనుల ఎస్టిమేషన్స్పూర్తయి 3నెలలవుతున్నా.. ఫైనల్ చేయలేదన్నా వినిపించుకోలేదు. మొత్తంగా ప్రతిపక్ష సభ్యుల ఆందోళన లెక్క చేయకుండా నిజామాబాద్ బల్దియా 2023- –24 ఫైనాన్షియల్ఇయర్కు అంచనా బడ్జెట్ రూ. 283 కోట్లతో ఆమోదించారు.
నగరంలోనిన్యూ అంబేద్కర్‌భవన్‌లో మేయర్ దండు నీతూ కిరణ్ అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ మీటింగ్జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మున్సిపల్ అధికారులు హాజరయ్యారు. మేయర్ నీతూ కిరణ్ ముందుగా 2023– -24 అంచనా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2022 –23 కు సంబంధించి రూ. 88 కోట్ల మిగులు చూపారు. 2023– 24 లో అన్ని మార్గాల ద్వారా సమకూరే ఆదాయం రూ. 171.23 కోట్లుగా ప్రతిపాదించారు. ఇందులో ట్యాక్సులు తదితర మార్గాల ద్వారా రూ.171 కోట్లు ఆదాయం సమకూరుతుందని, డిపాజిట్లు, అప్పుల కింద రూ. 11కోట్లు అలాగే, గ్రాంట్స్ రూపంలో రూ. 172 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. మిగులు రూ. 25 లక్షలు చూపారు. వచ్చే ఏడాది వివిధ అవసరాలకు రూ.170.63 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కా ర్పొరేషన్ కు సమకూరుతున్న ఆదాయంలో గ్రీన్ బడ్జెట్ కింద పది శాతం ఫండ్స్ రూ.88.3 కోట్లు కేటాయించారు. మూడో వంతు నిధులను నగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలు, స్లమ్, మైనారిటీ ఏరియాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. సభ్యుల అంగీకారంతో మొత్తం రూ. 283 కోట్ల అంచనా బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు మేయర్ ప్రకటించారు.
నగర సమస్యలపై చర్చకు పట్టు..
ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు నగరంలోని పలు సమస్యలపై చర్చ జరగాలని పట్టుబట్టారు. మేయర్ మాట్లాడుతూ ఆర్అండ్బీ ఆఫీసర్లు హాజరు కాకపోవడంతో సమస్యలపై చర్చించలేమని తోసిపుచ్చారు. బడ్జెట్ మీటింగ్కావడంతో బడ్జెట్ సంబంధిత అంశాల గురించే మాట్లాడాలని స్పష్టం చేశారు. నగరంలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గణేశ్ గుప్త , బల్దియా ఇన్చార్జి కమిషనర్చిత్రమిశ్రా హామీ ఇచ్చారు. వివిధ డివిజన్లలో పెరిగిన జనాభాకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఫండ్స్ మంజూరు చేయాలని నిర్ణయించారు.
సీఎం స్పెషల్ ఫండ్స్ కు కృషి..
సీఎం కేసీఆర్ ప్రకటించిన స్పెషల్ ఫండ్స్ ప్రతి డివిజన్ రూ.కోటి విడుదలకు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా హామీ ఇచ్చారు. గత ఫైనాన్షియల్ఇయర్తో పోలిస్తే పన్నుల వసూళ్లు మెరుగుపడినప్పటికీ, విస్తృత స్థాయిలో సౌలత్‌ల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండడంతో పన్నుల రాబడిని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఇన్చార్జి కమిషనర్ చిత్రామిశ్రా అన్నారు. ఈ స మా వేశంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గోపిడీ స్రవంతిరెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్న్యాలం రాజు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గడుగు రోహిత్ ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, బల్దియా ఆఫీసర్లు పాల్గొన్నారు.
బడ్జెట్ పత్రాలను చింపేసిన ప్రతిపక్షాలు
సభలో అధికారపక్షం తీరుపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ మీటింగ్హాల్ఆవరణలో బడ్జెట్ పేపర్లను చింపేశారు. శ్మశాన వాటిక లకు, ప్రైవేట్ హాస్పిటల్స్‌కు బడ్జెట్లో కేటాయింపులు చేయడమేమిటని నిలదీశారు. ప్రభుత్వానికి, కార్పొరేషన్ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలపై ఫోకస్పెట్టాలని డిమాండ్ చేశారు. తప్పుడు బడ్జెట్‌ను ప్రజలకు వివరించకుండా మీడియాను మీటింగ్హాల్లోకి అనుమతించకపోవడం సిగ్గుచేటన్నారు.