అన్నివర్గాల అభివృద్ధే అంతిమ లక్ష్యం : ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్, వెలుగు: అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే తన లక్ష్యమని బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.  నగరంలోని 37 డివిజన్ లో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకముందు 35 వ డివిజన్ లోని విఠళేశ్వర ఆలయంలో, 37 డివిజన్ లోని మారుతీ మందిరంలో పూజలు నిర్వహించా రు.  అనంతరం ఆయన మాట్లాడుతూ 9 ఏళ్ల లో నగర సుందరీకరణ పేరుతో బీఆర్ఎస్​ నాయకులు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.  కాళేశ్వరం  ప్రాజెక్టు కేసీఆర్​కు ఏటీఎం అయితే  బీఆర్​ఎస్​ అభ్యర్థికి బొడ్డెమ్మ చెరువు ఏటీఎంలా పనిచేసిందని ధ్వజమెత్తారు.  నగరంలో అండర్ గ్రౌండ్ పనులు పూర్తి చేయలేదన్నారు. 

ఒక్కరికీ కూడా డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వని ఎమ్మెల్యే మనకు అవసరమా  అని ప్రశ్నించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరాన్ని నెంబర్ వన్​గా తీర్చుదిద్దుతానని హామీ ఇచ్చారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు.  కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, పంచారెడ్డి లింగం,  న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, బంటు రాము, కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, సుక్క మధు, బూరుగుల ఇందిరా వినోద్, ఎర్రం సుదీర్, బంటు వైష్ణవి, పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, మెట్టు విజయ్,ఇల్లేందుల మమతా ప్రభాకర్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, చందుపట్ల వనిత శ్రీనివాస్,పంచారెడ్డి లావణ్య,నాయకులు భారత్ భూషణ్, గంగోనె గంగాధర్, టెంట్ హౌజ్​ శ్రీనివాస్, మురళి, మహేశ్​ పాల్గొన్నారు.