రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీపై నమ్మకం లేదు : బీజేపీ ఎంపీ అర్వింద్

తనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. తనపై జరుగుతున్న దాడుల వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఇప్పటికే వై కేటగిరి అధికారులు తమ ఇంటికి వచ్చారని, ప్రాణహాని ఉందని చెప్పిన విషయాలను వారు నోట్ చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీపై తనకు నమ్మకం లేదన్నారు. తనకు కేంద్ర ప్రభుత్వమే భదత్రా ఏర్పాటు చేసిందని చెప్పారు. తనకు ఎంత మందితో భద్రతా ఉంటుందనే విషయం సోమవారం (జులై 10న) సాయంత్రం వరకు క్లారిటీ వస్తుందన్నారు. తనకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది కాబట్టి.. ఇప్పుడు రాష్ర్ట సెక్యూరిటీ ఉంచాలా..? తీసేయాలా..? అనే దానిపై నిర్ణయం తీసుకుంటానన్నారు.