ఆర్మూర్, వెలుగు: ఎన్నికల ఏర్పాట్ల నిర్వహణలో భాగంగా గురువారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. బాల్కొండ సెగ్మెంట్ కు సంబంధించి భీంగల్ లో నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కోసం తహసీల్, ఎంపీడీవో ఆఫీస్లతో పాటు గవర్నమెంట్ కాలేజ్ బిల్డింగ్ లను పరిశీలించారు. ఆర్మూర్ లో తహశీల్, ఆర్డీవో ఆఫీస్ లతో పాటు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్బిల్డింగ్ను పరిశీలించారు.
రవాణా సౌకర్యం, టాయిలెట్స్ లాంటి వసతులపై ఆరా తీశారు. ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చోట రిపేర్లు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ పేర్కొన్నారు. అనంతరం ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను సందర్శించి కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, అడిషనల్ డీసీపీ జయరాం, ఆర్మూర్ ఏసీపీ జగదీశ్, సూపరింటెండెంట్ రషీద్, సంబంధిత శాఖల అధికారులు
పాల్గొన్నారు.