
- కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, వెలుగు : అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే సమాజంలోని అన్ని వర్గాలవారు సమాన హక్కులు పొందుతున్నారని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. సోమవారం నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం పని చేస్తుందన్నారు.
తరువాత రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలో స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, అదనపు కలెక్టర్ అంకిత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి నిర్మల, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీవోల యూనియన్ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గైని గంగారాం, స్టేట్ సెక్రటరీ పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షుడు సతీష్ పాల్గొన్నారు.