భూభారతితో రైతులకు భరోసా : రాజీవ్‌‌‌‌గాంధీ హనుమంతు

భూభారతితో రైతులకు భరోసా : రాజీవ్‌‌‌‌గాంధీ హనుమంతు
  • కలెక్టర్‌‌‌‌ రాజీవ్‌‌‌‌గాంధీ హనుమంతు

ఆర్మూర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి దోహదపడుతుందని నిజామాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ రాజీవ్‌‌‌‌గాంధీ హనుమంతు అన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై రైతులకు పవర్‌‌‌‌ పాయింట్‌‌‌‌ ప్రజెంటేషన్‌‌‌‌ ద్వారా కొత్త చట్టం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా భూములపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు. 

రెవెన్యూ అధికారులు గ్రామాలకు వచ్చి నేరుగా అర్జీలు స్వీకరించి, నిర్ణీత కాలంలో సమస్యను పరిష్కరిస్తారన్నారు. సదస్సులో ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, అడిషనల్​కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవో రాజాగౌడ్‌‌‌‌, తహసీల్దార్ రమేశ్‌‌‌‌, ఎంపీడీవో గంగాధర్, ఏవో రాంబాబు, ఎంఈవో నరేందర్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

నందిపేట, వెలుగు: ధరణి స్థానంలో కొత్తగా వచ్చిన భూభారతితో రైతుల భూ సమస్యలకు సత్వరపరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతు అన్నారు. ఆదివారం డొంకేశ్వర్​ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై రైతులతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా మ్యూటేషన్‌‌‌‌పై అభ్యంతరాలు ఉంటే ఆర్డీవోకు, కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు అప్పీల్​ చేసుకోవచ్చన్నారు. 

ఈ సందర్భంగా పలువురు రైతులు అసైన్డ్​ భూములకు పట్టాలు ఇప్పించాలని, సాగు చేస్తున్నప్పటికీ పట్టాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్​ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్​ వసంత్​రావ్​, ఎంపీడీవో బ్రహ్మానందం పాల్గొన్నారు.