
- కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
నిజామాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలో ఇంటర్నెట్ సర్వీస్‌తో కూడిన డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి తెచ్చామని, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు లక్ష్యంతో చదవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని జిల్లా లైబ్రరీలో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. పోటీ పరీక్షలకు కావాల్సిన మరిన్ని బుక్స్, జర్నల్స్ సమకూరుస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి లైబ్రరీకి వచ్చే యువత కోసం చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి మధ్యాహ్న భోజనం పెట్టించడం సంతోషకరమన్నారు.
పాత డీఈవో ఆఫీస్ బిల్డింగ్‌ను స్టడీ రూమ్స్‌గా వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చామన్నారు. ఇటీవల జిల్లాకు చెందిన 160 మంది యూత్ పోటీ పరీక్షలు రాసి సర్కారు కొలువులు సాధించడం గర్వకారణమన్నారు. స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్‌రెడ్డి, గ్రంథాలయ సెక్రటరీ బుగ్గారెడ్డి, రాజారెడ్డి, నరేష్‌రెడ్డి, తారకం, రాజేశ్వర్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.