పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ

పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ

వర్ని, వెలుగు: వర్ని, రుద్రూర్​ పోలీస్​స్టేషన్లను శనివారం సీపీ సాయిచైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.  రిసెప్షన్​ సెంటర్లు,  కంప్యూటర్ సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించారు.  రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.  బైక్‌లపై వెళ్లేటపుడు హెల్మెట్‌  తప్పక ధరించాలన్నారు.  గంజాయికి బానిసైన వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు.  సైబర్​ మోసగాళ్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలని సీపీ సూచించారు.  సీపీ వెంట బోధన్​ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్​, వర్ని  ఎస్​ఐ సాయన్న, మహేశ్, సిబ్బంది ఉన్నారు.