ఆర్మూర్, వెలుగు : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతపై మెజార్టీ కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం నెగ్గడంతో ఆమె చైర్పర్సన్ పదవి కోల్పోయారు. 24 మంది కౌన్సిలర్లు నెల కింద కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు నోటీసులు ఇవ్వగా, గురువారం ఆర్మూర్ మున్సిపల్ ఆఫీసులో ఆర్డీవో, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ వినోద్‌కుమార్ పర్యవేక్షణలో ఉదయం11గంటలకు ఓటింగ్ నిర్వహించారు. 24 మంది కౌన్సిలర్లు చేతులెత్తడంతో చైర్ పర్సన్పండిత్ వినీత పదవి కోల్పోయినట్లు ఆర్డీవో వినోద్ కుమార్ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో సొంత పార్టీ కౌన్సిలర్ల వల్లే వినీత పదవి కోల్పోవడం గమనార్హం. కాగా, ఆర్మూర్ మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. అవినీతి మొక్కలను ఒక్కోటి తొలగిస్తున్నామని, నెల కింద జీవన్ రెడ్డిని ఓడించామని, ఇప్పుడు చైర్ పర్సన్ ను ఔట్చేశామన్నారు.
నర్సాపూర్ మున్సిపల్ చైర్మెన్ రిజైన్
నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన మురళీయాదవ్ చైర్మన్ అయ్యారు. ఏడాదిన్నర కింద ఆయన బీఆర్ఎస్ అధిష్టానంపై విమర్శలు చేయడంతో పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మురళీ యాదవ్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. కాగా, బీఆర్ఎస్ నుంచి చైర్మన్ అయిన అతన్ని పదవి నుంచి దింపేందుకు ఆ పార్టీ అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించింది. వైస్ చైర్మన్ సహా 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇటీవల అడిషనల్ కలెక్టర్ కు అవిశ్వాస నోటీస్ ఇచ్చారు. ఆ పార్టీకి మెజారిటీ కౌన్సిలర్ల బలం ఉండడంతో కలెక్టర్ మీటింగ్ఏర్పాటు చేస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని, తన పదవి పోవడం ఖాయమని భావించి ముందుగానే రాజీనామా చేశారు.