- అడ్మిషన్ల ప్రక్రియకు గడువు 4 నెలలే
కామారెడ్డి , వెలుగు: మెడికల్ కాలేజీకి టెంపరరీ బిల్డింగ్స్ దొరకక జిల్లా అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అకడమిక్ ఇయర్లోనే కాలేజీలో అడ్మిషన్లు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో టెంపరరీ వసతులు కల్పించేందుకు కిందా మీదా పడుతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ బిల్డింగ్స్వెతికే పనిలో పడ్డారు. అడ్మిషన్ల ప్రక్రియకు నెలల గడువే ఉండడంతో టెంపరరీ ప్రైవేట్బిల్డింగ్స్దొరకక ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
గవర్నమెంట్ బిల్డింగ్ పనులు షురూ కాలే..
ఏడాదిన్నర కింద సీఎం కేసీఆర్కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభానికి వచ్చిన సందర్భంగా జిల్లాకు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారమే వెంటనే మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాలేజీ, హాస్పిటల్స్, హాస్టల్స్ నిర్మాణం కోసం రూ.460 కోట్ల ఫండ్స్ శాంక్షన్ చేశారు. కానీ ఇంకా బిల్డింగ్స్ నిర్మాణ పనులు షూరు కాలేదు. దీంతో కొత్త బిల్డిం గ్స్ నిర్మాణం పూర్తయ్యే వరకు టెంపరరీ బిల్డింగ్స్‌ను సమకూర్చాల్సి ఉంది. ప్రభుత్వం జిల్లా హాస్పిటల్‌కు మెడికల్ కాలేజీ హాస్పిటల్ ను మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది. లెక్చరర్స్ బిల్డింగ్, గర్ల్స్, బాయిస్ కోసం వేర్వేరుగా హాస్టల్ బిల్డింగ్స్ కావాలి. కాలేజీ వసతుల పై ఇటీవల రెండు సార్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ టీమ్స్ పరిశీలించాయి. హాస్పిటల్, ఎంసీహెచ్ బిల్డింగ్స్‌ను టీమ్మెంబర్లు పరిశీలించారు. క్లాసులను నిర్మాణంలో ఉన్న ఎంసీహెచ్( మదర్, చైల్డ్హాస్పిటల్) బిల్డింగ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. హాస్టల్స్ కోసం ప్రైవేట్ బిల్డింగ్స్ వెతుకుతున్నారు.
గడువులోగా సమకూర్చాలని..
ఈ అకడమిక్ ఇయర్లో క్లాసులు ప్రారంభం కావాలంటే ముందుగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ఇవ్వాలి. నామ్స్‌కు అనుగుణంగా ఇక్కడ వసతులు సమకూర్చాలి. ఇప్పటికే రెండు సార్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ టీమ్స్పరిశీలించాయి. రెండో సారి వచ్చినప్పుడు మరో 3 నెలల్లో మొత్తం పనులు పూర్తి కావాలని ఇక్కడి ఆఫీసన్లకు సూచించినట్లు తెలిసింది. అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయ్యే లోపు టీచింగ్ స్టాప్, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా హాస్పిటల్లో, ఎంసీహెచ్ బిల్డింగ్వద్ద కాలేజీ ఏర్పాటు పనులు హడావిడిగా సాగుతున్నాయి. ఇటీవల హెల్త్మినిష్టర్ హరీశ్ రావు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మెడికల్ కాలేజీ పనులపై రివ్యూ చేశారు. త్వరగా పనులు పూర్తి చేయాలని, ఉన్నతాధికారులు ఈ పనులపై ఫోకస్ పెట్టాలని సూచించారు.
తాత్కాలిక షెడ్ల నిర్మాణం
జిల్లా హాస్పిటల్లో ప్రస్తుతం 200 బెడ్స్ ఉన్నాయి.ఈ హాస్పిటల్లో మొదట 100 బెడ్స్కెపాసిటీ ఉన్నప్పటికీ ఇటీవల రోగుల తాకిడి, డెలివరీల సంఖ్య పెరుగుతుండడంతో అడిషనల్‌గా 100 బెడ్స్ పెంచారు. మెడికల్ కాలేజీకి హాస్పిటల్ కేటాయిస్తుండడంతో కాలేజీ పర్మిషన్ రావడానికి 300 బెడ్స్ అవసరం. మరో 100 బెడ్స్ పెంచాల్సి ఉంది. ఇప్పటికే బిల్డింగ్ ఇరుకైంది. దీంతో బిల్డింగ్‌పై భాగంలో తాత్కలికంగా షెడ్ల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.