నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో ముగ్గురు పిల్లలతో సహా ఇద్దరు తల్లులు చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నిఖిత, అక్షయ ఇద్దరూ అక్క చెల్లెళ్లు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబ కలహాలతో ఇరువురు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో గ్రామంలోని చెరువులో పిల్లలతో కలిసి దూకారు. గమనించిన స్థానికులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. వారు ఇద్దరు తల్లులు, ఇద్దరు చిన్నారుల్ని కాపాడారు. కానీ ఐదేళ్ల బాలుడి ఆచూకీ గల్లంతయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిఖిత భర్త మెదక్ జిల్లా డీఈవో ఆఫీస్ లో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.