ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

బాలికలు క్రీడల్లో రాణించాలి

కామారెడ్డి, వెలుగు: బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్  పోటీల్లో జిల్లాకు చెందిన బాలికల జట్టు స్టేట్‌‌లో ఫస్ట్​ వచ్చింది. సోమవారం ఆ జట్టు కలెక్టర్‌‌‌‌ను కలిసింది. ఈ సందర్భంగా ఆయన వారికి ప్రశంస పత్రాలు అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు షూటింగ్ బాల్‌‌ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాడడం సంతోషంగా ఉందన్నారు. జట్టులో  గాంధారి కేజీవీబీ కాలేజీకి చెందిన ఐదుగురు, పొతంగల్​స్కూల్‌‌కు చెందిన నలుగురు బాలికలు ఉన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్​దొత్రే,  షూటింగ్ బాల్ జిల్లా ప్రెసిడెంట్ సాయికుమార్, జనరల్ సెక్రటరీ లక్ష్మణ్‌‌ రాథోడ్, కేజీవీబీ ప్రిన్సిపాల్ శిల్ప, పేటా అసోసియేషన్ ప్రతినిధులు రంగా వెంకటేశ్వర్‌‌‌‌గౌడ్, నోముల మధుసూదన్‌‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా సెక్రటరీ సాయిలు పాల్గొన్నారు.  

టీబీ రోగులకు సరుకుల పంపిణీ

కామారెడ్డి, వెలుగు: ప్రధాన మంత్రి టీబీ ముక్త్‌‌ భారత్ అభియాన్​ ప్రోగ్రామ్‌‌లో భాగంగా సోమవారం దోమకొండ మండల కేంద్రంలో టీబీ రోగులకు పౌష్టికాహారం వస్తువులు పంపిణీ చేశారు. రోగులు త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో  పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు హెల్త్ స్టాఫ్‌‌ తెలిపారు. కార్యక్రమంలో టీబీ సూపర్‌‌‌‌వైజర్‌‌‌‌ వంగ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. 

విశిష్ట సేవలకు పురస్కారాలు 

నిజామాబాద్, వెలుగు: సమాజ సేవలో భాగస్వామ్యం కావడం పూర్వ జన్మ సుకృతమని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ మద్దకూరి సాయిబాబు అన్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న వారిని సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు పురస్కారాలను అందజేయడం ఆనవాయితీ. అందులో భాగంగానే విశేష సేవలందించిన దారం గంగాధర్, స్వర్ణ సమత, తోగర్ల సురేశ్‌‌, పసునూరి వినయ్ కుమార్, చిటిమిల్ల హరిప్రసాద్‌‌లను సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ ఇందూరు యువత ఆధ్వర్యంలో జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అనాథ శవాలకు అంత్యక్రియలు, రక్తదాన శిబిరాలు, చెట్ల పరిరక్షణ వంటి ప్రోగ్రామ్స్‌‌ నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ముస్కు రామేశ్వర్‌‌‌‌రెడ్డి, లక్కంపల్లి సంజీవన్‌‌ రావు, జగన్మోహన్, వాల బాలకిషన్, తోగటి ఆనంద్‌‌బాబు తదితరులు పాల్గొన్నారు

ప్రజావాణి ఫిర్యాదులపై స్పందించాలి

కామారెడ్డి, వెలుగు: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై ఆయా శాఖల ఆఫీసర్లు వెంటనే స్పందించాలని కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్​ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్‌‌‌‌తో పాటు, డీఆర్డీవో సాయన్న, ఏవో రవీందర్‌‌‌‌ దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్​ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు ప్రయార్టీ ఇచ్చి పరిష్కరించాలన్నారు. ఆన్​లెన్‌‌లో వచ్చే దరఖాస్తులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం మొత్తంగా 13 ఫిర్యాదులు వచ్చాయి.  

నిజామాబాద్‌‌లో 56 ఫిర్యాదులు

నిజామాబాద్/నిజామాబాద్‌‌ టౌన్, వెలుగు:  నిజామాబాద్‌‌ కలెక్టరేట్‌‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 56 మంది తమ సమస్యలపై ఫిర్యాదు చేశారని ఆఫీసర్లు తెలిపారు. అడినల్‌‌ కలెక్టర్ బి.చంద్రశేఖర్ , జడ్పీ సీఈవో గోవింద్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ అర్జీలను స్వీకరించారు. అనంతరం అడిషనల్‌‌ కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ప్రతి శాఖకు సంబంధించిన కార్యాలయం, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

వృద్ధురాలి ఆత్మహత్య

డిచ్‌‌పల్లి, వెలుగు: కడుపునొప్పి భరించలేక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నడిపల్లిలో సోమవారం జరిగింది. డిచ్‌‌పల్లి ఎస్సై గణేశ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొద్దుల భాగవ్వ (60)  బీడీలు చూడుతూ జీవనం సాగిస్తుంది. కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడున్న ఆమె సోమవారం నొప్పి తీవ్రం కావడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కొడుకు సంతోష్​ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

దుర్గమాత సేవలో ఎమ్మెల్యే జాజాల

లింగంపేట, వెలుగు:  దేవి నవరాత్రుల్లో భాగంగా గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారు సోమవారం దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శమిచ్చారు. ఎమ్మెల్యే జాజాల సురేందర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట సర్పంచ్ సంజీవ్​ యాదవ్, టీఆర్ఎస్ లీడర్లు సత్యంరావు, సత్యం,  శంకర్​నాయక్ పాల్గొన్నారు.

వైభవంగా  నవరాత్రి ఉత్సవాలు


కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో  శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆశోక్​నగర్ కాలనీ చండీ మంత్రాలయం, ఇల్చిపూర్‌‌‌‌లోని సరస్వతి ఆలయం,  హౌజింగ్ బోర్డు కాలనీలోని శారద మాత ఆలయాలతో పాటు  ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన  మండపాల్లో అమ్మవారు సోమవారం దుర్గమాత అలంకరణలో దర్శమిచ్చారు. భక్తులు కుంకుమ పూజలు, హోమాలు నిర్వహించారు.