- లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు
నిజామాబాద్, వెలుగు, వెలుగు, నెట్ వర్క్ : నిజామాబాద్ జిల్లాలో మొత్తం 32 మండలాల పరిధిలోని 32 గ్రామాల్లో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి లంగ్డాపూర్, నీలా పేపర్ మిల్లు ప్రోగ్రామ్‌లో పాల్గొనగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి నర్సింగ్‌పల్లి విలేజ్‌లో స్కీమ్‌ల లబ్ది పంపిణీ చేశారు.
గ్రామ సభల ఆమోదంతోనే..
సర్కారు ఆదేశాల మేరకు ఎలిజిబుల్ కుటుంబాలన్నీ నాలుగు స్కీమ్‌ల లబ్ధి పొందేలా జాబితా రూపొందించామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. మోర్తాడ్ మండలం దోన్‌పాల్ గ్రామంలో ఆయన స్కీమ్‌ల పంపిణీ ప్రోగ్రాంలో పాల్గొని ప్రసంగించారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా కింద ఎంపికైన వారికి సోమవారం నుంచి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. ఆర్డీవో రాజాగౌడ్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట ప్రకారం.. పేదలకు పథకాలు అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం కామారెడ్డి మండలం గూడెంలో 4 కొత్త స్కీమ్‌ల ప్రారంభ కార్యక్రమంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల మంజూరు పత్రాలు అందజేశారు.
ఆర్మూర్ మండలం కోమన్ పల్లి గ్రామంలోనే 38 రేషన్ కార్డ్ లు, 302 మందికి రైతు భరోసా, 69 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,92 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు కాంగ్రెస్ సెగ్మెంట్ ఇన్ చార్జి వినయ్ రెడ్డి అందజేశారు.
ఎల్లారెడ్డి మున్సిపల్ టౌన్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను దాదాపు 300 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్ని మండలం మల్లారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజు రుద్రూర్ మండలం బొప్పాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలం సంతయి పేట గ్రామంలో ఆదివారం నాలుగు ప్రభుత్వ పథకాల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా , రేషన్ కార్డులను అర్హులైన లబ్దిదారులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంజూరు పత్రాలను అందజేశారు.
నందిపేట మండలంలోని మల్లారం గ్రామంలో 130 మందికి రైతు భరోసా మంజూరు పత్రాలు, 52 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 45 మందికి రేషన్‌కార్డులు, 27 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జడ్పీ డిప్యూటీ సీఈఓ సాయన్న అందజేశారు.
డొంకేశ్వర్ మండలం గంగాసరం గ్రామంలో 167 మందికి రైతు భరోసా, 56 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 30 రేషన్‌కార్డులు, 35 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.