కామారెడ్డి టౌన్, వెలుగు : మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని స్కూల్ స్టూడెంట్స్‌కు జవనరి 4న సైన్స్ క్విజ్‌పోటీలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు స్కూల్స్ తరపున జనవరి 2వ తేదీ లోపు ఎన్రోల్ చేసుకోవాలన్నారు.
కామారెడ్డి జిల్లా స్టూడెంట్స్ 9394680680, నిజామాబాద్ జిల్లా స్టూడెంట్స్ 9966440700 నంబర్లకు ఫోన్‌చేసి తమపేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. పోటీలు జనవరి 4న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయన్నారు.