సిరికొండ, వెలుగు: మండలంలోని వర్జన్ తండా, న్యావనందిలో సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జట్పీటీసీ మాలవత్ మాన్సింగ్, సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తూంపల్లి చైర్మన్ రాములు, వైస్‌చైర్మన్ ఫిలిప్, సర్పంచులు కన్క శ్రీనివాస్, సంగ్లు, డైరెక్టర్లు రమేశ్, సురేందర్ ఉన్నారు.
యాద్గార్‌పూర్‌లో...
కోటగిరి: మండలంలోని యాద్గార్‌పూర్‌లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎత్తొండ సొసైటీ చైర్మన్ అశోక్ పటేల్, టీఆర్‌ఎస్ బాన్సువాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని చెప్పారు. అనంతరం కోటగిరి మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన వేడుకల్లో సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగాధర్, కోటగిరి, పొతంగల్ సొసైటీల చైర్మన్లు కూచి సిద్ధు, శాంతేశ్వర్ పటేల్, ఏఎంసీ చైర్మన్ తేల్ల లావణ్య, సర్పంచ్‌లు పత్తి లక్ష్మణ్, సాయిబాబా, శ్రీనివాస్ గౌడ్, వర్ని శంకర్, ఎంపీటీసీలు ఫారుఖ్, కొట్టం మనోహర్, నాయకులు బర్ల మధు, బీర్కూర్ గంగాధర్, చిన్న సాయన్న
పాల్గొన్నారు.
హాస్టళ్లను పరిశీలించిన కలెక్టర్
లంపీ స్కిన్‌పై అవగాహన పెంచాలి
టీబీ రోగులకు సరుకుల పంపిణీ
బీర్కూర్, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని పిట్లం టీబీ యూనిట్ పరిధిలోని బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం టీబీ రోగులకు ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నిఖిల్ మాట్లాడుతూ 24 మంది టీబీ పేషంట్లకి సరుకులను అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్లు సంతోష్ కుమార్, శశికాంత్, విఠల్, సూపర్ వైజర్లు, ల్యాబ్ సూపర్‌వైజర్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశకార్యకర్తలు
పాల్గొన్నారు.
నేషనల్ అవార్డు కోసం అప్లై చేసుకోండి
కామారెడ్డి, వెలుగు: కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే నేషనల్ లెవల్ అవార్డు కోసం కామారెడ్డి జిల్లాలోని యువజన సంఘాల నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తున్నట్లు జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ వై.దామోదర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 ఏడాదికి గాను నేషనల్ లెవల్‌లో అవార్డు కోసం సెలక్షన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు, రిజిస్ట్రేషన్ అయిన సంఘాల వాళ్లు అప్లయ్చేసుకోవాలన్నారు. వివరాల కోసం జిల్లా యూత్‌వెల్ఫేర్ ఆఫీస్‌లో సంప్రదించాలన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
డిచ్‌పల్లి, వెలుగు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను అమ్ముకోవాలని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సూచించారు. మంగళవారం ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌తో కలిసి డిచ్‌పల్లి, ఇందల్వాయి మండలాల్లోని రాంపూర్, మిట్టాపల్లి, కమలాపూర్, మల్లాపూర్గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పడించిన పంటను దళారులకు అమ్మి నష్ట పోవద్దన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,060 చెల్లిస్తోందని చెప్పారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేశ్‌నాయక్, పార్టీ మండల ప్రెసిడెంట్లు శ్రీనివాస్‌రెడ్డి, గంగదాస్, సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్, సర్పంచ్‌లు తిరుపతి, గణేశ్, సత్యనారాయణ, లీడర్లు లక్ష్మీనర్సయ్య, కృష్ణ, రవి పాల్గొన్నారు.
పసుపు బోర్డు కోసం 4న దీక్ష
ఆర్మూర్, వెలుగు: పసుపు బోర్డు సాధన కోసం రైతు జేఏసీ నాయకుడు ముత్యాల మనోహర్‌రెడ్డి 11 ఏళ్లుగా చెప్పులు లేకుండా నడకను సాగిస్తూ 12వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఈనెల 4న ఆర్మూర్ ఒక్క రోజు నిరాహార దీక్షను నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. పట్టణంలోని కుమార్ నారాయణ భవన్‌లో మంగళవారం మంథని గంగారం అధ్యక్షతన జరిగిన రైతు జేఏసీ మీటింగ్‌లో లీడర్లు వి.ప్రభాకర్, దేగాం యాదగౌడ్ మాట్లాడారు. ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన హామీని మరిచారన్నారు. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.3,500 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపు క్వింటాల్ మద్దతు ధర రూ.15 వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు సాధన ఉద్యమంలో రైతు నాయకులపై పెట్టిన కేసులను, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి సాధన కోసం
జరిగిన ఉద్యమంలో పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మీటింగ్‌లో జేఏసీ నాయకులు బి.దేవారం, జక్కుల లింగారెడ్డి, టి.గంగాధర్, యు.రాజన్న పాల్గొన్నారు.
ప్రజాధనం నీటిపాలు..
పిట్లం, వెలుగు: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల్‌చెరులో నిర్మించిన వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు ఆఫీసర్ల పనితనానికి అద్దం పడుతోంది. ఎక్కడా జాగా లేనట్లు మంజీరాలో నిర్మించడంతో ఎవరికి పనికి రాకుండా పోయింది. మంజీరాలో మద్దెల్‌చెరు, బండాపల్లి మధ్య మంజీరాలో చెక్‌డ్యాం నిర్మిస్తున్నారని తెలిసి కూడా నదిలో వీటిని నిర్మించారు. మంజీరాలో కడితే ఉపయోగం ఉండదని అభ్యంతరం చెప్పినా.. మొండిగా నిర్మించారని గ్రామస్తులు తెలిపారు. ఆఫీసర్ల తీరు వల్ల రూ.లక్షల ప్రజాధనం నీటిపాలైందని పలువురు మండిపడుతున్నారు.
పరువు తీస్తున్నాడని కొట్టి చంపారు
నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: ఊళ్లో దొంగతనాలకు చేస్తూ పరువు తీస్తున్నాడనే కోపం తల్లి, ఇద్దరు సోదరులు కలిసి ఒక బాలుడిని కొట్టి చంపారు. నిజాంసాగర్ పీఎస్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ మురళి కథనం ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన గ్రామానికి చెందిన కిష్టవ్వకు ముగ్గురు కుమారులు. చిన్నవాడై శేఖర్ (14) ఇటీవల గ్రామంలో ఓ చోరీ ఘటనలో దొర కడంతో స్థానికులు జరిమానా వేశారు. దీంతో ఆగ్రహించిన తల్లి కిష్టవ్వ, అన్నలు ఈశ్వర్, రాజు కలిసి శేఖర్ కొట్టారు. దీంతో ఆ బాలుడు చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.