కాకతీయ కెనాల్​లో ఇద్దరు గల్లంతు

మోర్తాడ్, వెలుగు: నిజామాబాద్​జిల్లా శ్రీరామ్​సాగర్​ప్రాజెక్టు(ఎస్ఆర్ఎస్పీ) కాకతీయ కెనాల్​లో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మెండోరా ఎస్సై శ్రీనివాస్​తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​లోని గాయత్రీనగర్​కు చెందిన చింటు, వేణుయాదవ్(23), ప్రణవ్(24) శుక్రవారం మెండోరా గ్రామానికి చెందిన తమ ఫ్రెండ్​పవిత్ర్ రెడ్డి వద్దకు వచ్చారు. నలుగురూ కలిసి మెండోరా సమీపంలోని కాకతీయ కెనాల్​లో స్నానం చేసేందుకు వెళ్లారు. ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. చింటు, పవిత్ర్ రెడ్డి బయటపడ్డారు. గల్లంతైన యువకుల గాలింపు కోసం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాల్వకు నీటి విడుదలను ఆపేశారు.