స్థానిక’ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువ!

స్థానిక’ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువ!
  • జిల్లాలో గ్రామీణ ఓటర్లు మొత్తం 8,29,463 మంది
  • పాత మండలాలు యూనిట్​గా ఓటర్​ ముసాయిదా 
  • కొత్త మండలాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం 
  • 28 మండలాల్లోనే పంచాయతీ అధికారుల లెక్కింపు 

నిజామాబాద్​, వెలుగు:  జిల్లాలోని పల్లెల్లో ఓటర్ల సంఖ్య తేల్చడానికి  నెలరోజులకు పైగా చేసిన కసరత్తు ముగిసింది. లోక్ సభ ఎన్నికల ఓటర్​లిస్టుతో ఇంటింటికి వెళ్లి బీఎల్​వోలు రెడీ చేసిన మార్పు చేర్పుల ఓటర్ల డ్రాఫ్ట్ నోటిఫికేషన్​ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఈనెల 21 వరకు అభ్యంతరాలు స్వీకరించి 28న ఫైనల్​జాబితా వెల్లడిస్తారు. ఆ జాబితాను ప్రామాణికంగా తీసుకునే పంచాయతీ ఎన్నికలకు వెళ్లడానికి ప్రిపరేషన్​ నడుస్తోంది.

 అయితే జిల్లాలోని పాత మండలాలను యూనిట్​గా తీసుకునే ఫైనల్​ఓటర్​లిస్టు రెడీ చేస్తున్నారు.  కొత్తగా ఏర్పాటైన మండలాలపై పంచాయతీరాజ్ శాఖకు ఎలాంటి ఆదేశాలు రాష్ట్ర సర్కారు నుంచి అందలేదు. దీంతో  తమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారమే అధికారులు ముందుకెళ్తున్నారు. 

అన్ని మండలాల్లో మహిళలే ఎక్కువ 

గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ, నాలుగు నెలల కింద నిర్వహించిన లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను మహిళలే డిసైడ్​ చేశారు. పురుషులకంటే ఎక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఓటర్లలోనూ మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈనెల13న ప్రకటించిన డ్రాఫ్ట్​ మేరకు ఇందూరు జిల్లాలో గ్రామీణ ఓటర్లు మొత్తం 8,29,463 ఉండగా.. వీరిలో మహిళలు 4,42,955, పురుషులు 3,86,493 ఉన్నారు.  

మొత్తం ఓటర్లలో మహిళ ఓటర్లే 56,462 ఎక్కువగా ఉన్నారు. ట్రాన్స్​జెండర్ ఓట్లు 15 ఉన్నాయి. అన్ని మండలాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువ ఉండడం గమనార్హం. ఇక పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా స్థానిక ప్రజాప్రతినిధులు గెలుపోటములను నిర్ణయించేది మహిళలే అని చెప్పొచ్చు. 

రెడీగా పోలింగ్​ బాక్స్​లు

జిల్లాలో 530 పంచాయతీలుండగా, గతనెల కొత్తగా మరో 15 ఏర్పాటు చేస్తూ అధికారిక గెజిట్​రిలీజవగా.. జీపీల సంఖ్య 545కు చేరింది.  బీసీ గణన, కొత్తగా ఏర్పడిన పంచాయతీలను పరిగణలోకి తీసుకుంటే పదేండ్లకు వర్తించేలా గత బీఆర్ఎస్​ సర్కార్ జారీ చేసిన రిజర్వేషన్లు  మారతాయి. ఎలక్షన్​లు ఎప్పుడు జరిగినా వినియోగించేందుకు రెడీ చేసిన బాక్సులు జడ్పీ ఆఫీసులో  భద్రపర్చారు. పేపర్​ బ్యాలెట్​ను షెడ్యూల్​ తర్వాత ప్రింట్ చేయిస్తారు. ​ 

ఇంకా 28 మండలాలే.. 

ఇందూరులో ప్రస్తుతం 34 మండలాలు ఉన్నాయి. అయితే పంచాయతీ ఆఫీసర్లు 28 మండలాలను యూనిట్​గా తీసుకునే ముందుకెళ్తున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాలూర, పోతంగల్, డొంకేశ్వర్, ఆలూర్​ మండలాలు ఏర్పాడ్డాయి. అంతకు ముందే నిజామాబాద్​సౌత్, నిజామాబాద్​నార్త్​ మండలాలు ఏర్పాటయ్యాయి. విభజించిన మండలాల్లో విడిగా తహసీల్దార్​ఆఫీస్​లు ప్రారంభించగా రెవెన్యూ పాలన నడుస్తోం ది.

అయితే విభజన మండలాలపై అధికారిక ఉత్తర్వులేవీ పంచాయతీ ఆఫీసర్లకు ఇప్పటికీ అందలేదు. దీంతో వారు 28 పాత మండలాలనే యూని ట్​గా  తీసుకున్నారు. అంటే విభజనకు ముందున్న కోటగిరి మండలాన్ని బేస్​ చేసుకొని ముసాయిదా లిస్టు ప్రిపేర్​ చేశారు. కొత్తగా ఏర్పాటైన పోతంగల్​మండలాన్ని పరిగణలోకి తీసుకోలేదు.