హాస్పిటల్స్ అభివృద్ధికి రూ.85 కోట్లు

హాస్పిటల్స్ అభివృద్ధికి రూ.85 కోట్లు
  • ఇప్పటికే రూ.22 కోట్లు మంజూరు
  • గవర్నమెంట్ సలహాదారుడు 
  • షబ్బీర్​అలీ

నిజామాబాద్, వెలుగు :  ఉమ్మడి జిల్లా సర్కార్​ హాస్పిటల్స్​ అభివృద్ధికి రూ.85 కోట్ల నిధులు మంజూరయ్యాయని గవర్నమెంట్​ సలహాదారుడు షబ్బీర్అలీ తెలిపారు. శుక్రవారం హెల్త్​ మినిస్టర్ దామోదర రాజనర్సింహతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్​ అలీ మాట్లాడుతూ ఈనెల 8న మంజూరు చేసిన రూ.22 కోట్లకు ఇవి అదనమన్నారు. నిజామాబాద్​లోని 750 బెడ్స్​ జీజీహెచ్​లో ఇప్పుడున్న ఒక లిఫ్ట్​కు అదనంగా మరో రెండు లిఫ్టులు ఏర్పాటు చేస్తామన్నారు. డ్రైనేజీ రిపేర్స్​, తాగునీటి వసతి పెంపు సహా సమగ్ర రిన్నొవేషన్​ పనుల కోసం మొత్తం రూ.63 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. మిగితా నిధులను కామారెడ్డిలోని 250 బెడ్స్​ జిల్లా హాస్పిటల్​లో సీటీ స్కాన్​ ఏర్పాటు చేస్తామన్నారు. ట్రామా సెంటర్​ నిర్మిస్తామన్నారు. 

దోమకొండలోని కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​ను 30 పడకల నుంచి 50 పడకలకు పెంచుతామని వివరించారు. వైద్య విధాన పరిషత్​ జీవో 137 ద్వారా మంజూరు చేసిన రూ.22 కోట్లు సివిల్​ నిర్మాణాలు, హాస్పిటల్స్​లో పరికరాల కొనుగోలుకు ఖర్చు చేస్తామన్నారు. హెల్త్​  మినిస్టర్​ దామోదర రాజనర్సాంహా త్వరలో ఉమ్మడి జిల్లా విజిట్​ చేసి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. సమావేశంలో స్టేట్​ హెల్త్​ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్​ చోంగ్తూ, హెల్త్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్ నరేందర్​కుమార్​, అదనపు డైరెక్టర్ వేముల థామస్​, స్టేట్​ ఎంఎస్​ఐడీసీ మేనేజింగ్​ డైరెక్టర్ హేమంత్​ సహదేవ్​రావు, పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​ డాక్టర్​ రవీందర్​నాయక్​, నిజామాబాద్​ జీజీహెచ్​ సూపరింటెండెంట్​ డాక్టర్​ శ్రీనివాస్, ప్రిన్సిపాల్​ శివప్రసాద్, కామారెడ్డి జీజీహెచ్ సూపరింటెండెంట్​ ఫరీదాబేగం, ప్రిన్సిపాల్​ డాక్టర్​ వి.శివప్రసాద్​ ఉన్నారు.