- డాక్టర్లు డుమ్మా.. నర్సులపైనే భారం
- మెడిసిన్స్ కొరతతో రోగులు పరేషాన్
- బోగస్ ఓపీ నమోదుపై డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో బస్తీ దవాఖానాల సేవలు నీరసించాయి. అర్బన్పీహెచ్సీలకు 3 కిలో మీటర్ల దూరంలో పది వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. పట్టణాల్లో పేదలు చిన్నచిన్న సమస్యలకు ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లకుండా అక్కడే వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ దవాఖానాలను ఏర్పాటు చేశారు. అయితే వివిధ కారణాల వల్ల ఇవి సరిగా పని చేయడంలేదు. ప్రతీనెలా ఇక్కడ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) పేషెంట్లకు ఇవ్వాల్సిన బీపీ, డయాబెటిస్, థైరాయిడ్మందులు అందుబాటులో లేవు.
డాక్టర్లు కూడా సరిగా డ్యూటీలకు హాజరుకావడంలేదు. డాక్టర్లు ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియక బస్తీ హాస్పిటల్స్‌కు వెళ్లడమే వేస్ట్ అని రోగులు అనుకుంటున్నారు. నిజామాబాద్ లో మూడు, ఆర్మూర్, బోధన్‌లలో ఒక్కో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. హాస్పిటల్లో ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక సపోర్టింగ్ స్టాఫ్ఉంటారు. అర్బన్ హెల్త్ సెంటర్లకు వెళ్లలేని స్లమ్ ఏరియా ప్రజలకు ఇక్కడ వైద్యం అందిస్తారు. ఎవరికైనా సీరియస్సమస్యలుంటే, సర్జరీలు అవసరమైతే పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. వైరల్‌ఫీవర్స్ ప్రబలిన సమయాల్లో తమ పరిధిలోని ఏరియాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి. కానీ జిల్లాలో బస్తీ దవాఖానాలు సరిగా పని చేయడంలేదు.
నిజామాబాద్ లోని మిర్చి కంపౌండ్‌లో ఉన్న బస్తీ దవాఖానకు రోజుకు పదిలోపు రోగులు మాత్రమే వస్తుండగా.. ఓపీ రిజిస్ర్టర్లో బోగస్ పేర్లను ఎంట్రీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈనెల 7న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యానారాయణ ఈ హాస్పిటల్ ను సడన్‌గా విజిట్చేశారు. ఆరోజు 80 మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసినట్టు రిజిస్టర్లో పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేశారు. అందులో ఇద్దరికి ఎమ్మెల్యే ఫోన్ చేసి అడగగా అసలు తమది నిజామాబాద్ జిల్లా కాదని, బస్తీ దవాఖానకు రాలేదని సమాధానం చెప్పారు. దీంతో సీరియస్ అయిన ఎమ్యెల్యే ధన్పాల్సిబ్బందిపై డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీకి ఫిర్యాదు చేశారు.
బోధన్‌లో ఓకే
నిజాంషుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యాక మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంద బెడ్ల హాస్పిటల్‌కు తాళం పడింది. ఎక్కువ మంది ఫ్యాక్టరీ కార్మికులుండే శక్కర్‌నగర్ కాలనీవాసుల కోసం ఐదేండ్ల కింద ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలో మాత్రం వైద్య సేవలు కొంత మెరుగ్గా ఉన్నాయి. రోజు 60 నుంచి 70 మంది ఓపీ నమోదవుతోంది. మెడిసిన్ కూడా అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్లు వారానికి ఒక్క రోజే..
నాగారంలోని 300 క్వార్టర్స్ బస్తీ దవాఖానకు సోమవారం ఒక్క రోజే డాక్టర్ వస్తున్నారని కాలనీవాసులు అంటున్నారు. బీపీ, డయాబెటిస్, థైరాయిడ్ మెడిసిన్స్ సరఫరా కరెక్ట్‌గా లేదు.
ఓపీ క్రమంగా తగ్గి 15కు పడిపోయింది. ఖానాపూర్ బస్తీ దవాఖానలో శనివారం ఒక్కరోజే డాక్టర్ అందుబాటులో ఉంటున్నారని స్థానికులు చెప్పారు. మిగితా రోజుల్లో స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ మాత్రమే ఉంటున్నారు. రోజుకు15 మంది దాకా వస్తున్న రోగులకు పారసిటమాల్ ట్యాబ్లెట్ చేతిలో పెట్టి పంపుతున్నారు. ఆర్మూర్ లోని మామిడిపల్లి దవాఖానాలో డాక్టర్ ఉండడంలేదు. ఇక్కడ మెడిసిన్స్ కూడా అందుబాటులో లేవు.