ఎస్సారెస్పీ వరద కాల్వకు చేరిన కాళేశ్వరం జలాలు

మోర్తాడ్, వెలుగు: కాళేశ్వరం నీళ్లు వరద కాల్వ ద్వారా ఎస్సారెస్సీ వద్ద ఉన్న జీరో పాయింట్ పంప్ హౌస్ కు గురువారం చేరుకున్నాయి. కమ్మర్పల్లి మండలం ఉపూర్ వద్ద కాళేశ్వరం జలాలకు ఆర్ అండ్ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి పూజలు చేశారు. 

ఆయన మాట్లాడుతు.. గోదారమ్మ ఎదురొస్తుందని కలలో కూడా  ఊహించలేదని 300 కిలో మీటర్లు రివర్స్  పంపింగ్ ద్వారా నీటిని తరలించడం గొప్పవిషయమన్నారు. వర్షాలతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా రైతులకు సాగునీరందిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని..అందుకే అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రూ. 90 వేల కోట్లతో పనులు జరిగితే రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.