నిజామాబాద్ యువకుడి కిడ్నాప్ కథ సుఖాంతం

నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. కిడ్నాప్ చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని బోధన్ పీఎస్ కు తరలించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని సెటిల్మెంట్ కోసం వెళ్లినట్లు నవీన్ వెల్లడించాడు. ఎవరినీ టీజ్ చేయలేదని పేర్కొన్నాడు.

నిజామాబాద్లో ఫిజికల్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేస్తున్న నవీన్ నిఖిల్ అనే వ్యక్తి సోదరిని టీజ్ చేసినట్లు సమాచారం. దీంతో సదరు యువకుడు నవీన్ ను  కిడ్నాప్ చేసి ఎడపల్లికి కారులో తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు ఎడపల్లి వద్ద ఉన్నట్లు నిర్ధారించుకుని అక్కడకు వెళ్లారు. అయితే మార్గమధ్యలోనే నిఖిల్, నవీన్ను వదిలిపెట్టారు.