పేలిన స్కూల్ బస్సు టైర్..తప్పిన పెను ప్రమాదం

నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.  స్కూల్ పిల్లలను తీసుకెళ్తుండగా ప్రమాదం బస్సు టైర్ పేలింది. చిన్నారులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

వేల్పూర్ మండలం లాక్కోర గ్రామంలో   స్కూల్ బస్సు చిన్నారులను తీసుకెళ్తోంది. జాతీయ రహదారిపై బస్సు టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో డ్రైవర్ తో పాటు..విద్యార్థులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అని భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సును వెంటనే ఆపిన డ్రైవర్..దిగి చూసే సరికి టైర్ పేలిందని గమనించాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.