
- నగల కోసం మహిళను హత్య చేసిన యువకుడు
- రోజంతా కారు డిక్కీలోనే డెడ్‌బాడీ
- కెనాల్లో పడేసేందుకు వెళ్తూ చిక్కాడు
- నిందితుడిని అరెస్ట్ చేసిన నిజామాబాద్ సిటీ పోలీసులు
నిజామాబాద్, వెలుగు: నగల కోసం మహిళను నమ్మించి యువకుడు హత్య చేశాడు. ఆపై డెడ్‌బాడీని కెనాల్ లో పడేసేందుకు కారు డిక్కీలో పెట్టుకొని వెళ్తూ దొరికాడు. నిజామాబాద్ లో కలకలం రేపిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముబారక్‌నగర్‌కు చెందిన మహిళలు కమల(46), పద్మ స్నేహితులు. వీరు బీడీ కార్మికులుగా చేస్తుంటారు. పద్మ కొడుకు రాజేశ్(26) కమలను చిన్నప్పటి నుంచి ఆంటీ అని పిలిచేవాడు. రాజేశ్ నేరప్రవృత్తి కలవాడు. గురువారం సాయంత్రం కమలకు ఫోన్ చేసి తల్లి పద్మ రమ్మంటుందని పిలిచాడు. ఆటోరిక్షాలో కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్దకు ఆమె వచ్చింది. ఆపై మరింత నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
ఒంటిపై నగలు ఇవ్వమని గొడవపడగా కమల ఒప్పుకోలేదు. తలపై బండరాయితో కొట్టగా చనిపోయింది. ఆ తర్వాత తను నడిపే ట్యాక్సీ కారు డిక్కీలో డెడ్ బాడీని వేసుకుని రాత్రి ఇంటికి వెళ్లాడు. డెడ్‌బాడీని దాస్నగర్సమీపంలోని నిజాంసాగర్కెనాల్ పడేసేందుకు శుక్రవారం మధ్యాహ్న సమయంలో వచ్చాడు. బ్లూకోల్ట్స్ పోలీసులు అనుమానించి కారు డిక్కీని ఓపెన్ చేసి చూడగా కమల డెడ్ బాడీ కనిపించింది. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేశామని ఎస్ఐ ఆరీఫ్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పూర్తి వివరాలు శనివారం వెల్లడిస్తామని చెప్పారు.