కరీంనగర్ సిటీ, వెలుగు : అంబేద్కర్ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. సోమవారం ఓ ఫంక్షన్‌హాల్‌లో సంవిధాన్ గౌరవ్ అభియాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌పై కాంగ్రెస్ ది కపట ప్రేమ అని అన్నారు.
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ దేశంలో ఎమర్జెన్సీ రోజులు తీసుకువచ్చిన చరిత్ర కాంగ్రెస్ దన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రధాని మోదీ నాయకత్వంలో సబ్ కా సాత్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ , సబ్ కా ప్రయాస్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకట్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారు రాజేంద్ర ప్రసాద్, ఆంజనేయులు, ఓదెలు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ రావు, లీడర్లు పాల్గొన్నారు.