దేశాభివృద్ధే బీజేపీ సంకల్పం : ధర్మపురి అర్వింద్​

దేశాభివృద్ధే బీజేపీ సంకల్పం : ధర్మపురి అర్వింద్​
  •     గత ప్రభుత్వం ఆరోగ్య బీమాను నిర్వీర్యం చేసింది
  •     నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​

సిరికొండ,వెలుగు : దేశం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేయడమే బీజేపీ సంకల్పమని నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ పేర్కొన్నారు. సిరికొండ మండలంలోని కొండాపూర్​లో వికసిత్ భారత్​సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. అర్వింద్​మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేనట్లు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయగా, రాష్ట్రంలో గతంలో అధికారంలో

ఉన్న బీఆర్ఎస్​ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా నిర్వీర్యం చేసిందన్నారు. అనంతరం లొంక రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. జిల్లా అధ్యక్షుడు దినేశ్​ కులాచారి, కార్యదర్శి నక్క రాజేశ్వర్, మండలాధ్యక్షుడు రాజేశ్వర్, సర్పంచ్​రమేశ్, బీసీ సెల్​జిల్లా కార్యదర్శి రామస్వామి, ఎంపీపీ గద్దె భూమన్న పాల్గొన్నారు.

నందిపేట : ఐఐటీ కాన్పూర్ వారు డిజైన్​ చైసిన బ్యాగ్​లు స్టూడెంట్స్​కు సౌకర్యవంతంగా ఉన్నాయని ఎంపీ ధర్మపురి అర్వింద్​ పేర్కొన్నారు. శుక్రవారం డొంకేశ్వర్ లోని గవర్నమెంట్​ హైస్కూల్​లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అర్వింద్​ మాట్లాడుతూ.. ప్రైమరీ క్లాస్​స్టూడెంట్స్ ​కోసం ఐఐటీ కాన్పూర్ ​వాళ్లు ఈ బ్యాగ్​లను ప్రత్యేకంగా డిజైన్​ చేసినట్లు చెప్పారు.

పార్లమెంట్​పరిధిలోని స్కూళ్లలో 30 వేల మంది స్టూడెంట్స్​కు ఈ బ్యాగులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. డొంకేశ్వర్ ​హైస్కూల్​ లో ఆధునిక అటల్​ల్యాబ్, ప్యూరిఫైడ్​ వాటర్ ప్లాంట్​ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేషనల్ ​ఇన్నోవేషన్ ​అడ్వైజర్​అభినేశ్ ​త్రిపాఠి, గ్రామసర్పంచ్​ ఛాయాచందు, ఎంపీటీసీ శ్రీనివాస్, ఎంఈవో శ్రీనివాస్​రెడ్డి, స్కూట్​హెచ్ఎం సురేశ్ పాల్గొన్నారు.