నన్ను రెచ్చగొడితే రాష్ట్రంలో గులాబీ పార్టీ లేకుండా చేస్తా: ఎంపీ అర్వింద్

నన్ను రెచ్చగొడితే  రాష్ట్రంలో  గులాబీ పార్టీ లేకుండా చేస్తా: ఎంపీ అర్వింద్

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్  బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  కేసీఆర్ కు తన ఫ్యామిలీ బిచ్చం పెట్టిందన్నారు.  తన తండ్రి   42 సీట్లు ఇస్తే  బతికిన బీఆర్ఎస్  పార్టీ నాయకులు తనను రెచ్చగొట్టొద్దన్నారు. తనను రెచ్చగొడితే   రాష్ట్రంలో గులాబీ పార్టీ లేకుండా చేస్తానని హెచ్చరించారు.  బీజేపీ  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా కోరుట్లలో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు అర్వింద్.

Also Read :- BRS అప్పుల కుప్పగా మారిస్తే.. తిరిగి గాడిలో పెడుతున్నం

కేసీఆర్ కుటుంబ సభ్యులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. వారి ముఖాలు చూసి ఓట్లు పడవన్నారు అర్వింద్.  రాష్ట్ర  బీజేపీ కూడా తలుపులు తెరుస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఒకరిద్దరూ మిగిలిపోయినా.. మంచివారు బీజేపీలోకి రావాలన్నారు.  ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక కాంగ్రెస్ మంత్రులకు నాయకులకు ఎమ్మెల్సీ ఓట్లు అడిగే  మోహం లేదన్నారు.  రామరాజ్య స్థాపన కోసం విద్యావంతులంతా బీజేపీకి ఓటేస్తారని చెప్పారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి , టీచర్స్ అభ్యర్థి కొమురయ్యకు ముందే శుభాకాంక్షలు తెలిపుతున్నట్లు చెప్పారు అర్వింద్.

తెలంగాణలో ఫిబ్రవరి 27న  మూడు ఎమ్మెల్సీ స్థానాలకు  ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ  బీజేపీ,కాంగ్రెస్ మధ్యే జరగనుంది.