- అర్వింద్...పసుపు బోర్డు సంగతి ఏమైంది?
- నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి
కోరుట్ల, వెలుగు : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలోని 3 చక్కెర ఫ్యాక్టరీలను ఓపెన్‌చేస్తామని ఎమ్మెల్సీ , నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోరుట్లలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. అన్ని ధరలను పెంచిన ఘనత బీజేపీదేనని అన్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చనిపోయిన , ప్రమాదం బారిన పడ్డ గల్ఫ్ కార్మికులకు రూ. 5లక్షలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని, వారి పిల్లల చదువుకు, ఉచితంగా వైద్యం అందించేందుకు చర్యలు చేపడుతామన్నారు.
బీడీ కార్మికుల సంక్షేమానికి కటాఫ్ లేకుండా రూ. 4 వేలు పెన్షన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. 2015 లో ఎంపీ కవిత , ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు టైంలో చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందన్నారు. మళ్లీ ప్రారంభించేందుకు అవకాశం ఉన్నా ఎంపీ అర్వింద్పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాగానే మళ్లీ ప్రారంభించడానికి కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. మూడు షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, ముత్యంపేటలోనూ ప్రారంభించి 2025 చివరికల్లా చెరుకు క్రషింగ్ మొదలుపెట్టి తీరతామన్నారు. - పసుపు బోర్డు ఏర్పాటు ఏమైందని ఎంపీ అర్వింద్‌ను ప్రశ్నించారు.
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జువ్వాడి కృష్ణారావు , నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెద్దెల్లి ప్రకాష్ , కొమిరెడ్డి కరం, విజయ్ ఆజాద్, కల్వకుంట్ల సుజిత్ రావు, టౌన్, మండల అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కొంతం రాజం పాల్గొన్నారు.