టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని ప్రజలు విశ్వసిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలలో వచ్చిన ఫలితాలే మునుగోడులోనూ రిపీట్ అవుతాయని చెప్పారు. నీరా ఉత్పత్తి కేంద్రం, టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి పద్మశాలీలను మంత్రి కేటీఆర్ మోసం చేశారని ఆరోపించారు. మునుగోడు ఓటర్లతో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
నిజామాబాద్ లో తనపై పోటీ చేసిన కల్వకుంట్ల కవిత చాలా ఇబ్బందులకు గురిచేశారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. కానీ అక్కడ ఏం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.