తొందరపడి కాంగ్రెస్లో చేరకండి..వాళ్లంతా మళ్లీ వస్తారు..

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేరుతున్న వారికి పలు సూచనలు చేశారు. తొందరపడి కాంగ్రెస్ లో చేరొద్దన్నాడు. కాంగ్రెస్ లో చేరినవాళ్లంతా తిరిగి బీజేపీలోకే వస్తారని చెప్పారు.  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ లో పర్యటించిన  ఎంపీ అరవింద్..ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ:పొలాల్లోకి దిగిన సీఎం హెలికాప్టర్

మా స్ట్రాటజీ మాకుంది..

రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖమ్మంలో బీజేపీ ఎట్లా గెలవాలో తమ స్ట్రాటజీ తమకుందని చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని..తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని చెప్పారు. బిడ్డను కాపాడటానికే కేసీఆర్ తాపత్రయమని ఎద్దేవా చేశారు. కుటుంబ పార్టీలకు ఓటేస్తే వాళ్ళ ఆస్తులు పెరుగుతాయని... పిల్లలు భవిష్యత్ కావాలంటే బీజేపీకి ఓటయ్యాలని మోడీ పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు.