కార్పొరేషన్ మీటింగ్ రసాభాస

  • సభ్యుల నిరసన మధ్య 39 ఎజెండా అంశాల ఆమోదం
  • ఫుట్​పాత్​ వ్యాపారుల తొలగింపుపై మజ్లిస్​ నిరసన
  • ట్రాఫిక్​ సమస్య రీత్యా 
  • అది కరెక్టేనని బీజేపీ కౌంటర్​
  • డెవలప్​మెంట్​పై చర్చ ఎక్కడని కాంగ్రెస్​ సభ్యులు గరం​

నిజామాబాద్, వెలుగు:  నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పాలకవర్గం ఆఖరి మీటింగ్ రసాభాసా మధ్య ముగిసింది. మరో వారంలో పదవీ కాలం పూర్తి చేసుకోనున్న కార్పొరేటర్లు ఎజెండాలో చేర్చని అంశాలపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా  బీజేపీ, కాంగ్రెస్​, మజ్లిస్​ సభ్యులు ఎవరికి వారు మేయర్​ నీతూకిరణ్​ ఛాంబర్​ ఎదుట బైఠాయించారు. 

ఎజెండా చదువుతుండగా మజ్లిస్​ అడ్డగింత

ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన మీటింగ్  మధ్యాహ్నం ఒంటి గంటకు స్టార్ట్ అయింది. పాలకవర్గానికి ఇది చివరి మీటింగ్​ కావడంతో గత ఐదేండ్లలో చేసిన డెవలప్​మెంట్​ను ఆమె క్లుప్తంగా వివరించారు. అసెంబ్లీని తలపించేలా కొత్త మున్సిపల్​ ఆఫీస్​ నిర్మించామని, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ నిర్మాణం, అన్ని కాలనీలకు మెరుగైన నీటి సరఫరా, పాదచారుల కోసం మొబైల్​ టాయిలెట్​ వ్యవస్థ, 277 వెహికల్స్​తో ఇంటింటి చెత్త సేకరణ, ఇంటెగ్రేటెడ్​ వెజిటేబుల్ మార్కెట్​ తదితర వాటిని నిర్మించే చాన్స్​ తమకు దక్కిందని చెప్పి అజెండా అంశాలను చదవడానికి సిబ్బందిని అనుమతించారు. అభివృద్ధి పనులు, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల విధుల పొడిగింపు వంటి అంశాలు ఉన్నాయి. 

ఎజెండాలోని ఎనిమిదో అంశం చదువుతున్న టైంలో మజ్లిస్​ పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్​ మహ్మద్​ ఇద్రిస్​ ఖాన్​ నగరంలో ఫుట్​ పాత్​ వ్యాపారులను తొలగించడంతో ఉపాధి కోల్పోయి ఆందోళన చెందుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ ఇంటికి వెళ్లే రోడ్​ క్లియర్​ చేయడానికి వ్యాపారుల పొట్టకొట్టారని ఆరోపించారు. 

వారంతా తిరిగి వ్యాపారాలు చేసుకునేలా తీర్మానం చేయాలని డిమాండ్​ చేశారు. దీనికి మేయర్​ నీతూకిరణ్​ అంగీకరించకపోవడంతో మీటింగ్​ హాల్​ నుంచి వచ్చి బయకూర్చుని నిరసన తెలిపారు. సిటీలో ట్రాఫిక్, పారిశుధ్య​ సమస్య తీర్చడానికి ఫుట్​ పాత్​ బిజినెస్​కు పర్మిషన్​ ఇవ్వొద్దని  బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి నాయకత్వంలో కార్పొరేటర్లు మల్లేశ్ యాదవ్, న్యాలం రాజు తదితరులు కోరారు. 

Also Read :- మడికొండ డంప్ యార్డ్ పై గ్రేటర్ వరంగల్‌ వాసుల ఆందోళన

నిజానికి మజ్లిస్​ నేతల సొంత బిజినెస్​ క్లోజ్​కావడంతో చిరు వ్యాపారుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.  హాల్​ బయట మజ్లిస్​ కార్పొరేటర్ల నినాదాలు చేశారు.  అనంతరం మొత్తం 39 అంశాలు ఆమోదం పొందాయని మేయర్​ నీతూకిరణ్​ ప్రకటించారు.  డెవలప్​మెంట్​ పనులపై చర్చలేకుండా మేయర్​ వెళ్లిపోవడేమిటని ఆగ్రహం చెందిన బీజేపీ కార్పొరేటర్లు హాల్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్​ కార్పొరేటర్​ గడుగు రోహిత్​ నేతృత్వంలో ఆయన మద్ధతుదారులు మేయర్​ నీతూ కిరణ్​ ఛాంబర్​ వద్దకు వెళ్లి అభివృద్ధిపై చర్చ లేకుండా మీటింగ్​ అర్థాంతరంగా ఎట్ల ముగిస్తారని ఆందోళనకు దిగారు.  ఇలా మజ్లిస్​, బీజేపీ, కాంగ్రెస్​ మూడు పార్టీలు ఎవరికి వారు తమ నిరసన వ్యక్తం చేశారు. . మీటింగ్​ ముగిసే దాకా ఉండి అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ వెళ్లిపోయారు. 

మీడియా బాయ్​​కాట్​

మీటింగ్​ కవరేజ్​కు వెళ్లిన మీడియాపై ఆంక్షలు పెట్టడాన్ని జర్నలిస్టులు నిరసించారు. గత ఐదేండ్లు మీటింగ్​ హాల్​ ఎదుట ఉన్న  వెయిటింగ్​ హాల్​దాకా  అనుమతించిన మేయర్​ నీతూకిరణ్​ శనివారం అక్కడిదాకా కూడా రానీయకపోవడం ఏంటని  ప్రశ్నించారు.  సమావేశపు అంశాలు ఆమె మీడియా ఎదుటకు రాగా బాయ్​కాట్​ చేస్తున్నామని  ప్రకటించి జర్నలిస్టులు  వెళ్లిపోయారు.