నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ కు నిరసన సెగ తగిలింది. మేయర్ తీరుకు నిరసనగా మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యక్రమంలో మేయర్ నీతూ కిరణ్ బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మేయర్ ఇవ్వాలనుకుంటున్న నాసిరకం చీరలు తమకొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు.
అయితే తాము ఎండలో పనిచేస్తామని.. ఈ చీరలు కట్టుకుంటే మరింత ఇబ్బందిపడతామని చెప్పారు కార్మికులు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని..ఇవ్వాలనుకుంటే తమకు క్వాలిటీ చీరలు ఇవ్వాలన్నారు. దీంతో మేయర్ నీతూ కిరణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.