అది రూరల్ ఏరియా.. తెలంగాణలోని నిజామాబాద్ నిజాంకాలనీ. అక్కడ ఓ గోదాం ఉంది. అందులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని.. బయట మార్కెట్ లో అమ్ముతున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. బియ్యం కోసం వెళ్లిన పోలీసులు.. అక్కడ ఉన్న వస్తువులు చూసి షాక్ అయ్యారు. బియ్యం లేకపోగా.. ఆ గోదాంలో కత్తులు, తుపాకీ ఉన్నాయి. అంతే కేసు మరో టర్న్ తీసుకుంది.
గోదాం నిర్వహకుడు మీర్ అంజద్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోదాంలో తుపాకీ ఎందుకు ఉంది.. అది ఎక్కడి నుంచి వచ్చింది.. దేశంలో తయారైన తుపాకీ నీకు ఎవరు ఇచ్చారు.. ఎక్కడ కొన్నావ్.. ఎందుకు కొన్నావ్.. గోదాంలోకి నీకు తెలియకుండా ఎలా ఉంది అనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. తుపాకీతోపాటు కత్తులు ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది.
కంట్రీ మేడ్ తుపాకీ విషయంలో పోలీసులు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో తుపాకీలు ఏమైనా ఇల్లీగల్ గా తయారు చేస్తున్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. బియ్యం కోసం రైడ్ జరిగితే.. తుపాకీ, కత్తులు దొరకటం.. అది కూడా నిజామాబాద్ లో కావటం.. దీనికితోడు ఎలక్షన్ టైం కావటంతో ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.