ఈద్గాలు, మసీద్​లను సందర్శించిన సీపీ

ఈద్గాలు, మసీద్​లను సందర్శించిన సీపీ

బోధన్​,వెలుగు: బోధన్ డివిజన్ లోని ఈద్గాలు, మసీద్ లను నిజామాబాద్ పోలీస్​ కమిషనర్  పి. సాయి చైతన్య​  సందర్శించారు.  బోధన్ టౌన్  పరిధిలోని నర్సి రోడ్ లో గల జద్దిద్  ఈద్గాను పర్యవేక్షించారు. ఈసందర్బంగా పోలీస్ కమిషనర్    ఈద్గా   పెద్దలతో మాట్లాడారు. అనంతరం పోలీస్​ సిబ్బందికి  పలు సూచనలు ఇచ్చారు. బోధన్ డివిజన్  పరిధిలో దాదాపు 300 మంది పోలీస్ సిబ్బంది తో  పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  సీపీ వెంట  బోధన్ ఏసీపీ  శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, బోధన్ సీఐ  వెంకటనారాయణ, ఎస్సై లు , ఈద్గా పెద్దలు  మహమ్మద్ గానం , ప్రెసిడెంట్  అలీమ్ రాజి తదితరులు ఉన్నారు.