- రౌడీ షీటర్ వెంట ఉన్న వ్యక్తికి కాలు ఫ్రాక్చర్
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రౌడీ షీటర్సయ్యద్ఆరీఫ్అలియాస్ డాన్(32)ను గురువారం దారుణంగా చంపారు. బోధన్ కోర్టులో ఓ కేసు వాయిదాకు వెళ్లి వస్తుండగా ఎడపల్లి మెయిన్ రోడ్డుపై పక్కా ప్లాన్‌తో మాటు వేసిన ప్రత్యర్థులు కత్తులతో నరికి చంపారు. ఆరీఫ్ వెంట ఉన్న అతడి ఫ్రెండ్బుల్లెట్ ఖాదర్కాలుకు ఫ్రాక్చరయ్యింది. ఓ దొంగతనం కేసులో రౌడీ షీటర్ ఆరీఫ్‌తో పాటు ఆరుగురిపై బోధన్ కోర్టులో కేసు నడుస్తోంది. ఇందులో నలుగురు రెండు బుల్లెట్ బండ్లపై నిజామాబాద్నుంచి బోధన్ వెళ్లి నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఎడపల్లి బ్రిడ్జి వద్దకు బండి నడుపుకుంటూ ఆరీఫ్ చేరుకోగానే అక్కడ రెడీగా ఉన్న లారీతో ప్రత్యర్థులు బుల్లెట్బండిని ఢీకొట్టారు. కింద పడగానే లారీ వెనుక కారు దిగిన నలుగురు వ్యక్తులు తల్వార్లతో ఆరీఫ్‌ను పొడిచి చంపారు. వెంట ఉన్న ఫ్రెండ్ ఖాదర్ జోలికి వెళ్లలేదు. అయితే లారీ ఢీ కొట్టినప్పుడు అతడి కాలు విరిగింది. ఆరీఫ్ వెంట మరో బుల్లెట్‌పై ఉన్న ఇద్దరు దాడిని చూసి భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఆరీఫ్ ను చంపిన ప్రత్యర్థులు కారులో పారిపోయారు. సమాచారం తెలుసుకున్న బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ శ్రీనివాస్ రాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆరీఫ్ డెడ్‌బాడీని జిల్లా హాస్పిటల్ కు తరలించి, ఖాదర్‌ను బోధన్హాస్పిటల్లో చేర్పించారు.
బెయిల్‌పై ఈమధ్యే బయటకు..
రౌడీ షీటర్ ఆరీఫ్‌పై రెండు హత్య కేసులు, రెండు హత్యాయత్నం కేసులు, ఓ దొంగతనం కేసు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1న నగర శివారులోని నెహ్రూనగర్ వద్ద జరిగిన ఇబ్రహీం అనే రౌడీ షీటర్ హత్య కేసులో ఆరీఫ్ నిందితుడిగా ఉన్నాడు. ఈమధ్యనే బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రత్యర్థులు పక్కా స్కెచ్‌తో ఆరీఫ్‌ను హతమార్చినట్టు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.