ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు నుంచి నిజామాబాద్ రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి శనివారం కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో చిన్న, సన్నకారు రైతుల బెంగ తీరినట్టేనన్నారు. రైతులు నీటిని సక్రమంగా పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
అనంతరం నడిమి తండా అంజన్న ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. మద్దుల్ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, తలకొక్కుల మహేందర్, చెలిమెల నర్సయ్య, గంగారెడ్డి, గాదరిమనోహర్రెడ్డి, చెలిమెల శ్రీనివాస్ పాల్గొన్నారు.