
తెలంగాణలో ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటున్న ఉద్యోగులను ఎక్కడిక్కడి ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. ఇటీవల పోలీస్ డిపార్ట్ మెంట్, మండల రెవెన్యూ ఆఫీసులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ విస్తృత తనిఖీలు చేస్తుంది.
Also Read :- కొత్తగా పెళ్లయినోళ్లంతా వెంటనే పిల్లల్ని కనండి
మార్చి 3న నిజామాబాద్ కవితా కాంప్లెక్స్ లో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. బాధితుడి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజును ఏసీబీ పట్టుకుంది. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ముందస్తు ప్లాన్ ప్రకారం ఏసీబీ రెడ్ హ్యండెడ్ గా సబ్ రిజిస్ట్రార్ ను పట్టుకుంది . అదుపులోకి తీసుకుని విచారిస్తోంది ఏసీబీ. రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.