సినిమా తుపాకీతో కుర్రోళ్ల బెదిరింపులు.. పట్టుకుని లోపలేసిన పోలీసులు

నిజామాబాద్ పట్టణంలో సినిమా తుపాకీతో దంపతులపై బెదిరింపులకు పాల్పడ్డారు కొందరు కుర్రోళ్లు. ఆపై వికృత చేష్టలు చేసి ఆ దంపతులను భయభ్రాంతులకు గురిచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వైద్య పరీక్షల కోసం దంపతులు ఖలీల్ వాడిలో ఓ ఆసుపత్రికి వెళుతుండగా.. పోకిరీలు బొమ్మ తుపాకీతో వారిని భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన కలకలం రేపింది. బుధవారం(అక్టోబర్ 18) ఖలీల్ వాడిలో వైద్య పరీక్షల కోసం గర్భిణీ, భర్త ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి వెళుతుండగా వెనక నుంచి ముగ్గురు పోకిరీలు బొమ్మ తుపాకీతో బెదిరించారు. ఆపై వికృత చేష్టలు చేసి ఆ దంపతులను భయభ్రాంతులకు గురిచేశారు.

దీంతో ఆ దంపతులు ఆందోళనకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఖలీల్ వాడి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి ఒకటో టౌన్ పోలీసులు చేరుకొని పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు.

ALSO READ : ఫేక్ బర్త్ సర్టిఫికెట్ కేసు.. ఆజం ఖాన్‌తో పాటు భార్య, కొడుకుకు 7ఏళ్ల జైలు శిక్ష

ఈ ఘటనతో నిజామాబాద్ పట్టణంలో పోకిరీలు రోజురోజుకు రెచ్చిపోతున్నారని.. నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి పోకిరీలపై పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.