
రైతుల తీర్మానాలివీ..
- ఆందోళనల సందర్భంగా రైతులు, రైతు నాయకులపై నమోదైన కేసులను ఎత్తివేయాలిపసుపుకు రూ.15 వేలు, ఎర్రజొన్నకు రూ.3,500 మద్దతు ధర కల్పించాలి.
- ప్రభుత్వమే విత్తనాలు సప్లై చేయాలి పసుపు బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలిఎన్నికల్లో హామీలిచ్చి నెరవేర్చని నాయకులను మళ్లీ ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేయాలి
- రైతు సమస్యలపై ఒక్కటై ఐక్యత చాటాలి
నిజామాబాద్ పసుపు, ఎర్రజొన్న రైతులగళం మార్మోగింది. రాజకీయం కోసం కాదు.. మద్దతు ధరపై ప్రభుత్వాల తీరు చూసి కడుపుమండి ఎన్నికల బాట పట్టామని తేల్చి చెప్పారు. ధర ఇస్తామని, బోనస్ ఇస్తామని తప్పుడు హామీలిచ్చిన సర్కారు చివరి నిమిషం వరకు నేతలతో, పోలీసులతో తమను అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నించిందని నిలదీశారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నపోరాటంపై ప్రభుత్వ పెద్దలే తప్పుడు ప్రచారాలు చేశారని మండిపడ్డారు. గత ఎన్నికల్లోపసుపు బోర్డుపై హామీ ఇచ్చి, ఇప్పుడు మాచేతుల్లో లేదనే వారికి అసలెందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఈవీఎంలలో ముఖ్య నేతల పేర్లుండే మొదటి మిషన్ ను వదిలేసిమిగిలిన వాటిలో ఇష్టం వచ్చిన వారికి ఓటేయాలని పిలుపునిచ్చారు. 178 మంది నామినేషన్లతో దేశందృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ పసుపు రైతులు మంగళవారం ఆర్మూర్ లోని జావీద్ భాయ్ మినీ స్టేడియంలో రైతు ఐక్యత సభ నిర్వహించారు. దీనికి జిల్లావ్యాప్తంగా రైతులు తరలివచ్చారు. తామంతా ఒకేమాటపై ఉన్నామని, మున్ముందు కూడా కలిసికట్టుగాఉంటామని స్పష్టం చేశారు.రైతులుఐదు తీర్మానాలు..
ఈ సందర్భంగా రైతులుఐదు తీర్మానాలు చేశారు. సభలో రైతు నాయకులు అన్వేష్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, ఇతర రైతులు మాట్లాడారు. తాము తమ డిమాండ్లపై పోరాడుతుంటే సీఎం కేసీఆర్, కేటీఆర్ లు రైతులను అవమానించేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటిస్తే మొదట పట్టించుకోలేదని, మొదటి రోజు 50 మంది నామినేషన్లు వేయగానే ఊళ్లల్లోకి వచ్చి బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ‘‘మా నామినేషన్లను కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకోలేదు. మరి టీఆర్‍ఎస్ ఒక్కటే ఎందుకు అడ్డుకుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎర్రజొన్నకు మద్దతు ధరఇవ్వలేమని, బోనస్ ఇస్తామన్న చెబుతున్న టీఆర్‌ఎస్‌నేతలు ఎంత ఇస్తారో మాత్రం ఎక్కడా చెప్పడం లేదు’’అని మండి పడ్డారు.పసుపుకు రూ.10 వేల మద్దతుధర, పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, హామీ నెరవేర్చక పోతే మళ్లీ ఓట్లడిగేందుకు రానన్న ఎంపీ కవిత మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కిసాన్ ఖేత్ ఆధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంతకాలం పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని గొప్పగా చెప్పుకున్న ఆమె ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. ‘‘పోటీలో ఉన్న రైతులను చులకన చేసి మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ నాయకులకు గుణపాఠం చెప్తాం. మద్దతు ధర కోసం ఆందోళనచేస్తున్న రైతులపైకి పోలీసులను ఉసిగొల్పి ఇబ్బందిపెట్టారు. ఐదేండ్లలో ఏనాడూ పసుపు బోర్డు ఏర్పాటుచేయని బీజేపీ.. ఇప్పుడు అధికారంలోకి రాగానేఐదు గంటల్లో ఎలా ఏర్పాటు చేస్తుంది? ఈ కల్లబొల్లి మాటలు ఎవరు నమ్ముతారు? గతంలో ఎన్నడూలేని విధంగా బాల్కొండ సెగ్మెంట్లో లీకేజీ నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కే పరిస్థితి తలెత్తింది. ఎస్సారెస్పీ లీకేజీవాటర్ కోసం ఉద్యమిస్తే రైతుల మీద కేసులు పెట్టిజైల్లో వేశారు. పసుపు ధర కోసం ఆందోళన చేస్తే జైళ్లోపెట్టారు. 12 బ్యాలెట్ యూనిట్లలో మొదటి యూనిట్ వదిలేసి మిగతా వాటిల్లో ఏ గుర్తుకైనా ఓటేయాలి’’అని ఆయన అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ రైతులు పోటీ చేయాలన్నారు. ఎన్ని కల్లో గెలుపోటములు పక్కనబెడితే తమ డిమాండ్‌ను బలంగా వినిపించడంలో రైతులు సక్సెస్ అయ్యారనిప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు.
ఇది చరిత్రాత్మక ఎన్నిక
ఇది చరిత్రాత్మక ఎన్ని క. రాజకీయ పార్టీలకురైతులు ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు పార్టీలన్నీపరేషాన్ అవుతున్నాయి. రైతులు వేసిన నామినేషన్లు ఒక్కటి కూడా రిజె క్ట్ కావద్దని నేనుదేవుడికి మొక్కుకున్న. నామినేషన్లు వేసినో ళ్లం తా బరిలో ఉండడం గొప్ప విషయం. ఇప్పుడుఎన్ని కల్లో ఫలితాలను డిసైడ్ చేసేది రైతన్నలుకాదు.. రైతు మహిళలే. నిజామాబాద్ ఎన్ని కల్లో 12 బ్యాలెట్ యూనిట్లు పెట్టారు. ఎలాంటికన్ ్యూజ్ కాకుండా పన్నెండింటి లో మొదటిఈవీఎంను వదిలేసి మిగిలిన 11 ఈవీఎంలలోని ఏ గుర్తుపైనైనా ఓటేయండి . మద్దతు ధరదక్కకపోవడంతో జిల్లాలో రైతులు ఏటా వెయ్యికోట్లు నష్టపోతున్నారు. రైతుల హక్కుల కోసంపోరాటం జరుగుతుంది. వారిని గెలిపించాల్సినబాధ్యత అందరిపై ఉంది.
రచనారెడ్డి, న్యాయవాది
ఈ పోరాటం ఆగొద్దు
నామినేషన్లు వేసిన రోజే పసుపు ఎర్రజొన్నరైతులు గెలిచారు. శాశ్వత పరిష్కారం వచ్చేవరకు ఈ పోరాటం సాగాలి. ఇప్పుడు దేశంయావత్తూ ఆర్మూర్ రైతుల వైపు చూస్తు న్నది.దేశంలోని అన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. చైతన్యవంతులైన ఆర్మూరురైతులు దేశ రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించాలి. ఇన్నాళ్లూ రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారితో ఆడుకున్నరాజకీయ పార్టీలు ఇకపై జాగ్రత్తగా ఉంటాయి.రైతులు పార్లమెంట్ లో అడుగుపెట్టినా , పెట్టకపోయినా నామినేషన్లు వేయడంతోనే గెలిచారు.ఈసారి అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనాపసుపు బోర్డును కచ్చితంగా ఏర్పాటు చేస్తుంది.రైతుల నామినేషన్లతో పార్టీలు దిగి వచ్చాయి.వారి హామీలన్నీ పసుపు, ఎర్రజొన్న చుట్టే తిరుగుతున్నాయి. అమెరి కాలో పసుపు ధర కిలోకురూ.280 ఉంటుం ది. క్వింటా ల్ కు రూ.28వేలవుతుంది. కానీ రైతుకు రూ .4,500 కూడారావడం లేదు.
– ప్రొఫెసర్ కె.నాగేశ్వర్