నిజామాబాద్, వెలుగు : జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో అదనంగా మరో రెండు కొత్త కోర్టులను శనివారం హైకోర్టు జడ్జి ఎన్.తుకారం ప్రారంభించారు. అడిషనల్ సివిల్‌కోర్టుతో పాటు ఐదో అడిషనల్ జూనియర్ కోర్టును ఇక్కడ ఏర్పాటు చేశారు. జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, అడిషనల్కలెక్టర్ కిరణ్ కుమార్, అడిషనల్డీసీపీ జయరాం పాల్గొన్నారు.