నిజామాబాద్ జిల్లా కేంద్రంగా భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. అయితే యూనియన్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని తెలిసింది. ప్రైవేటు వ్యక్తుల పేరిట రూ.కోట్లల్లో స్కాం చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు గుర్తించిన లెక్కల ప్రకారం 42 మంది ఖాతాల్లో రూ.5 కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. శివాజీ నగర్ బ్యాంకులో పని చేస్తున్న బ్యాంక్ మేనేజర్ అజయ్ ..ముద్ర, బిజినెస్, పర్సనల్, విద్యా, ఓ.డి. రుణాల పేరుతో ఖాతాదారుల పేర్ల తో రుణాలు తీసుకున్నాడు. అయితే వాటిని లబ్దిదారుల ఖాతాకు కాకుండా నేరుగా తన ఖాతాలకు మళ్లించాడు. ఆ తర్వాత పలువురికి ఈఎంఐ చెల్లించాలని బ్యాంకు నుంచి వారి ఫోన్లకు సందేశాలు వెళ్లాయి. దీంతో పాటు మరి కొందరు డిఫాల్టర్ అయ్యారు.
ALSO READ | Cyber Scam Alert: వాళ్లకు ఆధార్ నెంబర్ తెలిస్తే చాలు..మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తారు
బాధితులు బ్యాంకుకు వెళ్లి ఆరాతీయగా స్కాం జరిగిన విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై అప్రమత్తమైన యూనియన్ బ్యాంక్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. బాధితులను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం స్కాంకు పాల్పడిన సదరు అధికారి అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. అయితే బ్యాంకు అధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.