నిజామాబాద్అర్బన్, వెలుగు: నిజామాబాద్అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను వివిధ కుల సంఘాల ప్రతినిధులు సన్మానించారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన ధన్పాల్ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంగళవారం ధన్పాల్కార్యాలయానికి వచ్చిన బీజేపీ నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. తనకు అండగా నిలిచి ఎన్నికల్లో విజయాన్ని అందించిన నగరవాసులకు రుణపడి ఉంటానని, వారు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.