పీకలదాకా తాగిన యువకులకు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. సోయి లేకుండా తాగి..వైన్స్ షాపు ముందే తన్నుకున్నారు. స్థానికులు, పోలీసు కానిస్టేబుల్ వారించినా వినలేదు. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ నగరంలో ఈ ఘటన జరిగింది.
నిజామాబాద్ నగరంలోని పవన్ టాకీస్ దగ్గర ఉన్న వైన్స్ షాపు ముందు మద్యం మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిని కొందరు యువకులు బీరు బాటిళ్లతో కొట్టి హత్య చేశారు. పగ పట్టినట్లే బాధితుడిపై బీరు సీసాలతో విరుచుకుపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.