తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన ఎన్‌ఎల్‌సీఐఎల్ ప్రాజెక్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: మొత్తం 239 పోస్టుల్లో ఇండస్ట్రియల్ ట్రైనీ/ ఎస్‌ఎంఈ అండ్ టెక్నికల్ (ఒ&ఎం): 100, ఇండస్ట్రియల్ ట్రైనీ (మైన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్): 139 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: టెన్త్ స్టాండర్డ్, ఐటీఐ, సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా అభ్యర్థులు అర్హులు. వయసు 37 ఏండ్లకు మించరాదు. ఓబీసీ అభ్యర్థులు 40 ఏళ్లు, ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులు 42 సంవత్సరాలు మించకూడదు రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.nlcindia.in వెబ్సైట్లో సంప్రదించాలి.