గుడ్ న్యూస్ : ఒక్క ఎగ్జామ్ తో NLCలో జాబ్.. జీతం లక్షా 10 వేలు

గుడ్ న్యూస్ : ఒక్క ఎగ్జామ్ తో NLCలో జాబ్.. జీతం లక్షా 10 వేలు

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్ఎల్​సీ) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు మే 15వ తేదీలోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య: 171
పోస్టులు: జూనియర్ ఓవర్ మెన్ 69, మైనింగ్ సిర్దార్ 102.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 
వయోపరిమితి: యూఆర్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 ఏండ్లు, ఓబీసీలకు, 33 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏండ్లు మించకూడదు. 
అప్లికేషన్: ఆన్​లైన్​ ద్వారా. 
అప్లికేషన్ ఫీజు: జూనియర్ ఓవర్ మెన్ (యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ) అభ్యర్థులకు రూ.595, జూనియర్ ఓవర్ మెన్ (ఎస్సీ, ఎస్టీ)లకు రూ.295, మైనింగ్ సిర్దార్ (యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ) అభ్యర్థులకు రూ.486, మైనింగ్ సిర్దార్(ఎస్సీ, ఎస్టీ)లకు రూ.236 చెల్లించాలి.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 15
లాస్ట్ డేట్: మే 14.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 

సాలరీ:నెలకు రూ.26 వేల నుంచి 1,10,000