స్పోర్ట్స్
ఆర్చరీలో ప్రపంచ రికార్డు
తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ తుర్కియేలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నమెంట్లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్ రౌండ్లో ప్రపంచ రికార్డుతో అదరగొట్టింది.
‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’కు చెస్ టైటిల్
కజకిస్తాన్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మహిళల జట్ల మధ్య జరిగిన చెస్ టోర్నమెంట్‌లో ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టు టైటిల్ దక్కించుకుంది. భారత్ నుంచి హారిక, సవితాశ్రీ ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
నేషనల్
క్వాంటమ్ మిషన్‌కు ఆమోదం
క్వాంటమ్ సాంకేతికతలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన - అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించే ‘జాతీయ క్వాంటమ్ మిషన్’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023–31 మధ్య రూ.6,003 కోట్లు దీని కోసం ఖర్చు చేస్తారు.
‘టీసీఎస్’కు టాప్ ప్లేస్
‘భారతదేశంలో పనిచేయడానికి ఉత్తమమైనవిగా’ ఉద్యోగులు భావిస్తున్న కంపెనీల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) టాప్ ప్లేస్ లో నిలిచింది. లింక్డ్‌ఇన్ భారత్‌లో అత్యుత్తమ 25 కంపెనీలతో జాబితా వెలువరించగా అమెజాన్, మోర్గాన్ స్టాన్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. భారత్ - అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఆర్థిక సంవత్సరంలో 128.55 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 78.31 బి.డాలర్లకు చేరాయి. అమెరికా నుంచి దిగుమతులు 16% పెరిగి 50.24 బి.డాలర్లుగా నమోదయ్యాయి. చైనా, యూఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
డిజిటల్ లావాదేవీల్లో బెంగళూరు టాప్
పేమెంట్ సర్వీసుల సంస్థ వరల్డ్‌లైన్ ఇండియా నివేదిక ప్రకారం దేశీయంగా గతేడాది డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ, ముంబై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
హైదరాబాద్‌కు 65వ స్థానం
హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ అధ్యయనంలో ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది. ముంబయి 21వ స్థానం దక్కించుకుంది. 3.40 లక్షల మంది మిలియనీర్లతో న్యూయార్క్ నగరం తొలి స్థానం పొందింది.
వ్యక్తులు
మను బాకర్
జాతీయ రైఫిల్/పిస్టల్ సెలక్షన్ ట్రయల్స్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో మను బాకర్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో మను 31-–29తో చింకీ యాదవ్‌ను ఓడించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబుతా విజేతగా నిలిచాడు.
నూతక్కి ప్రియాంక
ఫ్రాన్స్‌లో జరిగిన ‘టోర్నియో ఎంఐఎఫ్ ఇకామ్ లియోన్–2023’ అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజయవాడకు చెందిన మహిళా గ్రాండ్ మాస్టర్ నూతక్కి ప్రియాంక చాంపియన్‌గా నిలిచింది. తొమ్మిది రౌండ్ల టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రియాంక ఏడు పాయింట్లతో టాప్‌లో ఉంది.
వెర్ స్టాపన్
ఫార్ము లావన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిలో మ్యాక్స్ వెరైపెన్(రెడ్ బుల్, 25 పాయింట్లు) విజేతగా నిలిచాడు. లూయిస్ హామిల్టన్(మెర్సిడెజ్, 18 పాయింట్లు) నుంచి గట్టిపోటీ ఎదురైనా తొలిసారి ఆస్ట్రేలియన్ టైటిల్‌ను మ్యాక్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
లుకాస్ హెల్మెక్
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 33 ఏళ్ల లుకాస్ హెల్మెక్ గంటకి 3,182 పుష్ అప్‌లు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించాడు. లుకాస్ నిమిషానికి 53 పుష్ అప్‌లు చేశాడని గిన్నిస్ వరల్డ్ అధికారులు తెలిపారు. ఈ రికార్డు కోసం మూడేళ్లు లుకాస్ ట్రైనింగ్ తీసుకున్నాడు.
నందినీ గుప్తా
రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల నందినీ గుప్తా ఫెమినా మిస్ ఇండియా వరల్డ్–2023గా ఎంపికయ్యారు. మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. శ్రేయా పూంజా మొదటి రన్నరప్‌గా, స్ట్రెలా లువాంగ్ రెండో రన్నరప్‌గా నిలిచారు.
తెలంగాణ
రెండు కొత్త మండలాలు
రాష్ట్రంలో రెండు కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లా నుంచి పాల్వంచ మండలంగా ఏర్పాటు చేయగా, జోగులాంబ గద్వాల జిల్లాలో ఎర్రవల్లి నూతన మండలంగా ఏర్పాటు చేశారు.
హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
హుస్సేన్‌సాగర్ తీరంలో ఆవిష్కరించిన అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహానికి అరుదైన గౌరవం లభించింది. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ స్మారకం నమోదైంది.
ఇంటర్నేషనల్
జనాభాలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించింది. ప్రస్తుతం భారత జనాభా 142.86 కోట్లతో తొలి స్థానంలో 142.57 కోట్లతో రెండో స్థానంలో ఉంది.
సైన్స్ అండ్ టెక్నాలజి
‘స్టార్ షిప్’ ప్రయోగం ఫెయిల్
మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ రూపొందించిన అతిపెద్ద రాకెట్ ‘స్టార్‌షిప్’ నింగిలోకి ఎగిసిన కాసేపటికే పేలిపోయింది. చంద్రుడు, అంగారకుడిపైకి మానవ సహిత యాత్ర కోసం స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేసిన ప్రయోగం విఫలం అయింది.
ఉక్రెయిన్ చేతికి ‘పేట్రియాట్’
అమెరికా అత్యాధునిక పేట్రియాట్ గైడెడ్ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్ చేతికొచ్చింది. భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే పేట్రియాట్ క్షిపణి వ్యవస్థతో శత్రు సేనల నుంచి దూసుకొచ్చే క్షిపణులు, స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను కూల్చేయొచ్చు.
ప్రపంచంలోనే తేలికైన పెయింట్
ప్రపంచంలోనే తేలికైన పెయింట్‌ను అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఎలాంటి రంగు లేకుండా ఉండే ఈ ప్లాస్మోనిక్ పెయింట్‌ను ఏ రంగులోకి అయినా సులువుగా మార్చుకోవచ్చు. ఈ పెయింట్‌ను యూనివర్సిటీ ప్రొఫెసర్ దెబాశిస్ చందా నాయకత్వం వహించారు.