ప్రపంచంలో అందమైన కారు ఇదే.. 

ప్రపంచంలో అందమైన కారు ఇదే.. 
  • వరల్డ్ నెంబర్1 కారుగా..‘స్మార్ట్ ఫర్ టూ కాబ్రియో’
  • 2010 నుంచి ఉన్న 626 కార్లకు ‘కార్‌‌వావ్‌‌’ సైంటిఫిక్ టెస్ట్ 

ఇప్పుడున్న కార్లలో అన్నింటికంటే అందమైన కారు ఏది?  ‘‘అదెలా చెప్పగలం? ఒక్కొక్కరికి ఒక్కో కారు నచ్చుతుంది. పైగా అందం అనేది చూసే కళ్లను బట్టి ఉంటుందని చెప్తుంటరు కదా..” అంటారా? కానీ.. అందానికో లెక్కుంది. దానికో థియరీ ఉంది. అందాన్ని లెక్కించేటందుకు ఒక ఫార్ములా కూడా ఉంది! అదే ‘గోల్డెన్ రేషియో’. ఈ రేషియో ఎంత బాగా ఉంటే ఆ వస్తువు అంత అందంగా, పర్​ఫెక్ట్ గా ఉన్నట్లు లెక్క. ఈ గోల్డెన్ రేషియోను లెక్కించేటందుకు అల్జీబ్రాలో ఓ ఈక్వేషన్ కూడా ఉంది. అందుకే.. 2010 నుంచి ఇప్పటిదాకా మార్కెట్లోకి వచ్చిన 626  కార్ల మోడళ్లలో ఏది పర్​ఫెక్ట్‌‌గా ఉందో తేల్చాలని బ్రిటన్‌‌కు చెందిన ‘కార్ వావ్’ అనే కంపెనీ ఈ ఫార్ములాను ట్రై చేసింది. దీంతో అన్ని కార్ల కంటే.. ‘స్మార్ట్ ఫర్ టూ కాబ్రియో (2016)’ కారు పర్‌‌ఫెక్ట్ అందంతో ఉందని తేలింది. జర్మనీకి చెందిన డైమ్లర్ ఏజీ కంపెనీ తయారు చేసిన ఈ కారు.. 98.83% గోల్డెన్ రేషియోతో టాప్ ప్లేస్‌‌లో నిలిచింది. దీని తర్వాత ఫోక్స్‌‌వ్యాగన్ అప్ (2011) 98.62%, వాక్స్ హల్ మోకా (2016) 98.57% గోల్డెన్ రేషియోతో రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. టొయోటా కరోలా (2019) 98.56%, నిస్సాన్ మైక్రా (2013) 98.55%తో నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఇక అన్ని కార్లలోకెల్లా ఫోర్డ్ ఫియెస్టా గోల్డెన్‌‌ రేషియో 34.31% మాత్రమే ఉన్నట్టు తేలింది. మెర్సిడిస్ జీఎల్‌‌సీ 63 ఏఎంజీ కూప్, ఆడీ ఏఋ స్పోర్ట్ బ్యాక్ కార్లకు తక్కువ రేషియో వచ్చింది.

అందం లెక్క చెప్పే గోల్డెన్ రేషియో!

ఏదైనా ఒక వస్తువు లేదా మనిషి ఎంత అందంగా, పర్‌‌​ఫెక్ట్‌‌గా ఉన్నారో సైంటిఫిక్‌‌గా చెప్పేందుకే శతాబ్దాల కిందటసైంటిస్టులు గోల్డెన్ రేషియో టెస్టును కనుగొన్నారు. వివిధ భాగాలు, వాటి మధ్య కోణాలు, దూరాన్ని బట్టి గోల్డెన్ రేషియోను అంచనా వేస్తారు. ఇదెంత ఎక్కువ ఉంటే ఆ వస్తువు అంత పర్‌‌ఫెక్ట్‌‌గా, అందంగా ఉన్నట్టుభావిస్తారు. క్రీస్తు పూర్వం300 సంవత్సరం నుంచే ఈ క్వేషన్ ను ఎందరో ప్రముఖ ఆర్టిస్టులు, సైంటిస్టులు ఉపయోగించారట. ఈ ఫార్ములా ప్రకారం అత్యంత అందమైన మహిళగా మోడల్‌‌ బెల్లా హదీద్‌‌ నిలిచిన సంగతి తెలిసిందే.

No. 1 Best: 2016 Smart ForTwo Cabrio