దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతుంటే ఆస్పత్రికి వెళతాం. అయితే చేతబడి.. బాణామతి ఇలాంటివి ఉన్నాయని కొందరు మూఢ నమ్మకాలతో ఉంటారు. వారిని భూత వైద్యుల వద్దకు తీసుకెళ్లినా... ఏదో ఒక సందర్భంలో కార్పొరేట్ ఆస్పత్రిలోనో... సర్కారీ దవాఖానాలో ట్రీట్ మెంట్ తీసుకోక మానరు. అయితే ఇప్పుడు తాజాగా గురుగ్రామ్ లోని మేదాంత కార్పొరేట్ ఆస్పత్రికి సంబంధించిన ఓ పిక్ వైరల్ కావడంతో అసలు ఆ ఆస్పత్రిలో 13 వ అంతస్థు ఉందా లేదా.. ఉంటే అందులో ఏమైనా మూఢనమ్మకాలు ఉన్నాయా... అసలు ఆ అంతస్థు గురించి ఎందుకు ఎలివేటర్ లో ప్రస్తావించలేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. రెడ్డిట్ యూజర్ ఆ ఆస్పత్రికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. మేదాంత ఆస్పత్రిలో 13 వ అంతస్థు ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. రెడ్డిడ్ యూజర్ పోస్ట్ చేసిన పిక్ ను పరిశీలిస్తే అందులో 13 వ అంతస్థు లేదని స్పష్టంగా అర్దమవుతుంది. కాని 14, 15 అంతస్థులు ఉన్నట్లుగా ఉంది. అయితే ఆ అంతస్థులో మూఢనమ్మకాలతో ఇబ్బంది పడేవారు ఉంటారని కొందరు అంటున్నారు. అందుకే గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రి ఎలివేటర్ లో 13వ అంతస్థులోకి ఎవరూ వెళ్లకుండా నిరోధించారని... 13 అనే గుర్తు మూఢనమ్మకాలకు చాలా దగ్గరగా ఉంటుందట. ఈ చిత్రాన్ని రెడ్డిడ్ లో గుర్తు తెలియని వ్యక్తి మీడియా హ్యాండిల్ పోస్ట్ చేయడంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది.
గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రి ఎలివేటర్ ఫొటోలో అన్ని అంతస్థులను షో చేశారు. అయితే 7 వ అంతస్థును హైలెట్ చేశారు. 13 వ అంతస్థు ఉన్నట్లు అసలు చూపలేదు. దీంతో 13 అనే అంకెను ఎందుకు చూపలేదా అనే భయాలు అక్కడున్న వారికి వస్తున్నాయి. దీనివెనుక ఏమైనా మూఢనమ్మకాలున్నాయా అనే అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ఇలా చూపకపోవడానికి ట్రిస్కైడెకాఫోబియా అంటారని కొందరంటున్నారు. కొన్ని పద్దతులు.. విధానాల ప్రకారం వాస్తు శిల్పలు 13 వ సంఖ్యను వదిలేస్తారట. 12 తరువాత 14 వ అంతస్థుకు చేరుకుంటారట. అయితే దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు కాని కొన్ని చోట్ల ఈ ఆచారాలను పాటిస్తారని తెలుస్తోంది.
రెడ్డిడ్ లో పోస్ట్ చేసిన పిక్ వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. ఫైర్ సేఫ్టీ కోసం 13వ అంతస్థు ఖాళీగా ఉందని కొందరు పోస్ట్ చేయగా ... మరికొందరు 13ను అన్ లక్కీ నెంబర్ అంటారని కామెంట్ చేవారు. మరొక వ్యక్తి మూఢ నమ్మకాలపై స్పందిస్తూ ఆ స్పత్రిలో .. అలాంటి వాటితో సంబంధం లేదని రాసుకొచ్చారు,